అయోధ్య తీర్పుపై మోడీ ఏమన్నాడంటే

అయోధ్య భూ వివాదంలో నేడు సుప్రీం కోర్టు తుది తీర్పును ఇచ్చిన విషయం తెల్సిందే.

గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ వివాదంను అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం ముగించింది.

అయోధ్యలోని ఆ భూమిని హిందువులకు ఇచ్చేందుకు ఓకే చెప్పడం జరిగింది.ఈ విషయమై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది.

ముందు నుండి కూడా ఈ కేసును ఊహించిన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.ఇక ఈ తీర్పుపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.

ఈ కేసులో ఒకరు గెలిచినట్లు ఒకరు ఓడినట్లు కాదని, భారత దేశ పౌరులు గెలిచారంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించి ప్రస్తుత శాంతిని కంటిన్యూ చేయాలంటూ ఈ సందర్బంగా మోడీ పిలుపునిచ్చాడు.భారత న్యాయ వ్యవస్థ పారదర్శకతకు మరియు దూరదృష్టికి ఈ తీర్పు ఒక నిదర్శనంగా పేర్కొనవచ్చు అంటూ ఈ సందర్బంగా ప్రధాని పేర్కొన్నారు.130 కోట్ల మంది భారతీయులు శాంతి మరియు సంయమనంతో ఈ తీర్పును గౌరవించాలంటూ మోడీ సూచించారు.ఇది ప్రతి ఒక్కరి విజయంగా భావించి అల్లర్లకు దూరంగా ఉండాలంటూ ఆయన పేర్కొన్నాడు.

Advertisement
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

తాజా వార్తలు