అయోధ్య తీర్పుపై మోడీ ఏమన్నాడంటే

అయోధ్య భూ వివాదంలో నేడు సుప్రీం కోర్టు తుది తీర్పును ఇచ్చిన విషయం తెల్సిందే.గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ వివాదంను అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం ముగించింది.

 Narendra Modi Coemments On Ayyodhya Rama Mandhir-TeluguStop.com

అయోధ్యలోని ఆ భూమిని హిందువులకు ఇచ్చేందుకు ఓకే చెప్పడం జరిగింది.ఈ విషయమై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది.

ముందు నుండి కూడా ఈ కేసును ఊహించిన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.

ఇక ఈ తీర్పుపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.

ఈ కేసులో ఒకరు గెలిచినట్లు ఒకరు ఓడినట్లు కాదని, భారత దేశ పౌరులు గెలిచారంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించి ప్రస్తుత శాంతిని కంటిన్యూ చేయాలంటూ ఈ సందర్బంగా మోడీ పిలుపునిచ్చాడు.భారత న్యాయ వ్యవస్థ పారదర్శకతకు మరియు దూరదృష్టికి ఈ తీర్పు ఒక నిదర్శనంగా పేర్కొనవచ్చు అంటూ ఈ సందర్బంగా ప్రధాని పేర్కొన్నారు.130 కోట్ల మంది భారతీయులు శాంతి మరియు సంయమనంతో ఈ తీర్పును గౌరవించాలంటూ మోడీ సూచించారు.ఇది ప్రతి ఒక్కరి విజయంగా భావించి అల్లర్లకు దూరంగా ఉండాలంటూ ఆయన పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube