మనోవిరాగి టైటిల్ తో తెలుగులో మోడీ బయోపిక్  

Narendra Modi Biopic Manoviragi Poster Released, PM Narendra Modi, Lyca Productions, Sanjay Leela Bhansali, Bollywood, Biopic Trend - Telugu Biopic Trend, Bollywood, Lyca Productions, Narendra Modi Biopic Manoviragi Poster Released, Pm Narendra Modi, Sanjay Leela Bhansali

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది.ప్రముఖుల జీవిత కథలని తెరపై ఆవిష్కరించడానికి దర్శక, నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

TeluguStop.com - Narendra Modi Biopic Manoviragi Poster Released

ఈ నేపధ్యంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖుల జీవిత కథలు తెరపైకి వచ్చాయి.వాటిలో చాలా వరకు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

ఇప్పుడు అదే కోవలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ కూడా తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్నారు.

TeluguStop.com - మనోవిరాగి టైటిల్ తో తెలుగులో మోడీ బయోపిక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సంజయ్ త్రిపాఠీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి తెలుగులో మనోవిరాగి, తమిళంలో కర్మయోగి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

సౌత్ లో ప్రముఖ నిర్మాత సంస్థ లైకా ప్రొడక్షన్ తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమాని సమర్పిస్తుంది.మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బయోపిక్‌ పోస్టర్‌ను లైకా ప్రొడక్షన్ విడుదల చేసింది.
నరేంద్ర మోడీ పాత్రలో అభయ వర్మ నటిస్తున్న మనోవిరాగి చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.గుజరాత్‌లోని వాద్ నగర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మనోవిరాగి బయోపిక్‌ గురించి లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాత ఎ.సుభాస్కరన్ మాట్లాడుతూ ప్రధాని మోడీ టీనేజ్ జీవితంలో ముఖ్యమైన మలుపులతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో సమర్పిస్తుండడం చాలా సంతోషంగా ఉంది.ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం అని అన్నారు.ఇక మనోవిరాగి కథలో మోడీ జీవితంలో ఆర్ఎస్ఎస్ భావజాలంకి ఆకర్షితుడు కావడం, తరువాత సన్యాసం స్వీకరించడం వంటి అంశాలని ప్రస్తావించనున్నట్లు తెలుస్తుంది.

#SanjayLeela #NarendraModi #Biopic Trend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Narendra Modi Biopic Manoviragi Poster Released Related Telugu News,Photos/Pics,Images..