ఎన్టీఆర్ కి వెన్నుపోటులో..కాంగ్రెస్ వాటా ఎంత..??  

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని ఈ మధ్యకాలంలో దేశ ప్రధాని మోడీ టార్గెట్ గా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు మోడీ నేరుగా బాబు పై వ్యాఖ్యలు చేయడంతో ఆఖరికి బాబు కి ఉన్న క్రేజ్ ఒక్క సారిగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చి పడింది. దేశంలో ఏ నేత చంద్రబాబు పై విమర్శలు చేయాలని అనుకున్నా సరే బాబు విషయంలో వెన్నుపోటు ప్రస్తావన తీసుకురాకుండా ఉండలేరు. అయితే

Narendra Modi Asks About NTR Death To Chandrababu Naidu-Chandrababu Naidu Indhira Gandhi Narendra Ntr History Rahul Sonia Ycp

Narendra Modi Asks About NTR Death To Chandrababu Naidu

మోడీ గతంలో బాబు ని టార్గెట్ చేసుకుని ఎన్నో వ్యాఖ్యలు చేసినా ఈ సారి బాబు వెన్నుపోటు స్టొరీ లోకి కాంగ్రెస్ చెయ్యి పట్టుకుని మరీ లాగేశారు. దాంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఆ వివరాలలోకి వెళ్తే.

దేశంలో అస్థిరతకు చోటిచ్చేలా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారు అంటూ కొన్ని పార్టీలో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణలు ప్రధానంగా వచ్చేవి కాంగ్రెస్ పార్టీ నుంచీ ఎక్కువగా వినిపిస్తున్నాయి..ఈ నేపథ్యంలో..

మోడీ ప్రత్యర్ధులు అందరికి పార్లమెంట్ వేదికగా భారీ కౌంటర్ ఇచ్చారు. తమపై వ్యాఖ్యలు చేసేముందు కాంగ్రెస్ పార్టీ గతాన్ని మర్చిపోకూడదు అంటూ కౌంటర్ ఇచ్చారు. బాబు పై ఉన్న వెన్నుపోటు మారక కాంగ్రెస్ కి కూడా అంటుకుందని ఆయన అన్నారు. అయితే బాబు పేరు ఉచ్చరించకుండానే ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తూ మోడీ బాబు , కాంగ్రెస్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంతకీ మోడీ ఏమన్నారంటే.

Narendra Modi Asks About NTR Death To Chandrababu Naidu-Chandrababu Naidu Indhira Gandhi Narendra Ntr History Rahul Sonia Ycp

గతంలో ఏపీలో, తమిళ నాడు లో “ఎన్టీఆర్ , ఎంజీఆర్” ప్రభుత్వాల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందొ ఒక్క సారి పరీక్షించుకోవాలని ఆయన అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని మీరు కూల్చలేదా , సంస్థలని నాశనం చేస్తునానని అంటున్న మీరు అప్పట్లో ఎన్టీఆర్ కి చేసింది ఏమిటి అంటూ ఫైర్ అయ్యారు. దాంతో ఒక్క సారిగా ఏపీలో ప్రజలకి మోడీ వ్యాఖ్యల మర్మం అర్థం అయ్యింది.

కాంగ్రెస్ పార్టీ అప్పట్లో బాబు తో కలిసి వెన్నుపోటులో భాగం అయ్యింది అనే ఆలోచనలో పడ్డారు ఏపీ ప్రజలు. అయితే ఈ విధమైన వ్యాఖ్యలు మోడీ చేయడం ద్వారా ఒకే సారి బాబు ని , కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడమే ధ్యేయం అన్నట్టుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు.