ఏప్రిల్‌ 6న మోడీ ఏం ప్రకటించబోతున్నారు?

దేశ వ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్‌ డౌన్‌ రెండు వారాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఈనెల 6వ తారీకున ప్రధాని మోడీ అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం జరుగబోతుంది.దేశ చరిత్రలో మొదటి సారి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ఈ క్యాబినెట్‌ సమావేశం జరుగబోతున్నట్లుగా తెలుస్తోంది.

 What Is The Message Given Modi On April 6th, Narendra Modi, Corona Virus, India-TeluguStop.com

క్యాబినెట్‌ సమావేశంకు సర్వం సిద్దం అయ్యింది.మంత్రులతో చర్చించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారంటూ దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

దేశ వ్యాప్తంగా కరోనా విపత్తు నేపధ్యంలో విధించిన లాక్‌ డౌన్‌ ఫలితాుల తద్వారా ఏర్పడిన ఆర్థిక సమతుల్యత గురించి మోడీ ప్రస్థావించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇదే సమయంలో ఏప్రిల్‌ 15 నుండి నాలుగు దశల్లో లాక్‌ డౌన్‌ను ఎత్తి వేస్తామంటూ ప్రకటించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

మొదటగా ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాలను లాక్‌ డౌన్‌ నుండి మినహాయించబోతున్నారట.ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాలను హాట్‌ స్పాట్స్‌గా గుర్తించారు.అక్కడ మరో రెండు వారాల పాటు మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయలనే నిర్ణయానికి వచ్చారట.అదే విషయాన్ని ఏప్రిల్‌ 6న ప్రధాని మోడీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube