ఆ అమ్మాయిల డ్యాన్స్ చూసి చప్పట్లు కొట్టిన నరేంద్ర మోదీ.. వీడియో వైరల్...!

తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ జానపద నృత్యాన్ని చూసి ఫిదా అయిపోయారు.అంతేకాదు, ఆ ట్రెడిషనల్ డ్యాన్స్ కు చప్పట్లు కొడుతూ ప్రశంసించారు.

 Narendra Modi Applauded After Watching The Girls Dance , Modi , Viral News ,-TeluguStop.com

అస్సాంలోని దిబ్రూఘర్‌లోని ఖనికర్ మైదానంలో మోదీ గురువారం నాడు మోదీ పలు విషయాలపై ప్రసంగించారు.ఇదే సందర్భంగా ఆయన అస్సాం అమ్మాయిలు చేసిన ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేశారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాట్య కళాకారులతో పాటు డ్యాన్స్ చేయడం చూడొచ్చు.

గురువారం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, షిప్పింగ్ కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌తో కలిసి ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు 5,000 మందికి పైగా నృత్యకారులు తమ సంప్రదాయ దుస్తుల్లో బిహు నృత్యాన్ని చేశారు.ఈ నాట్య ప్రదర్శనను ఆస్వాదిస్తూ, మోదీ ‘డోల్’ వంటి మ్యూజిక్ బీట్‌లకు చప్పట్లు కొడుతూ కనిపించారు.5,000 మంది బిహు డ్యాన్సర్లు 17 వేర్వేరు లొకేషన్లలో మోదీకి వెల్ కమ్ చెప్పారు.ఈ ఈవెంట్ లో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి ఈ డ్యాన్సర్లు చాలా రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఒక గంటకు పైగా ఇతర ప్రోగ్రామ్స్ తో పాటు అస్సాం కళాకారుల బిహు నృత్యం, జానపద నృత్య ప్రదర్శనలను మోదీ తిలకించారు.బిహు ఈవెంట్ లో పాల్గొన్నందుకు మోదీకి కేంద్ర మంత్రి సోనోవాల్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇది అస్సాం ప్రజల పట్ల, వారి సంస్కృతి పట్ల ప్రధాని మోదీకి ఉన్న ప్రేమను తెలియజేస్తోందని ఆయన అన్నారు.

అస్సాం పర్యటనలో ఉన్న మోదీ గురువారం నాడు ఏడు కొత్త క్యాన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు.అలాగే టాటా గ్రూపు అధినేత‌ రతన్ టాటాతో కలిసి ఆల్రెడీ నిర్మించిన క్యాన్సర్ చికిత్స కేంద్రాలను ప్రారంభించారు.త్వరలో మరో ఆరు క్యాన్సర్ ఆసుపత్రులను దేశ ప్రజల కోసం నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇదే ప్రసంగంలో మోదీ సాయుధ బలగాల చట్టాన్ని పూర్తిగా తొలగించే పనిలో ఉన్నామని చెప్పారు.‘శాంతి, ఐక్యత, అభివృద్ధి’ ర్యాలీలో మాట్లాడిన మోదీ నాగాలాండ్, మణిపూర్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ చట్టాన్ని ఎత్తివేస్తే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube