బాబు 'వెన్నుపోటు' గురించి మాట్లాడిన ప్రధాని  

  • టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఉన్న కోపాన్ని ఇప్పటివరకు పరోక్షంగా వ్యక్తం చేస్తూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు డైరెక్ట్ గా రంగంలోకి దిగిపోయారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో టీడీపీని ఎలా అయినా దెబ్బ కొట్టాలని మోదీ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే… ఆయన మీద డైరెక్ట్ గా మాటల తూటాలు పేల్చారు.

  • Narendra Modhi Sensetional Coments On Chandrababu Naidu-

    Narendra Modhi Sensetional Coments On Chandrababu Naidu

  • తెలుగు ప్రజల ఆరాధ్యదైవమైన ఎన్టీఆర్ కు చంద్ర బాబు రెండోసారి వెన్నుపోటు పొడిచారని ప్రధాని మోదీ ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు ఏపీ బీజేపీ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ బాబు పై విరుచుపడ్డారు. ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే… చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని రెండోసారి వెన్నుపోటు పొడిచారని ప్రధాని విమర్శించారు. చంద్రబాబు తన పదవి కాపాడుకోవటం కోసమే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారని వెల్లడించారు. కొడుకు కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.