ప్రధాని విమర్శలు :కేసీఆర్ కి ఆ భావం ఎక్కువ ... అందుకే వాటిని నమ్ముకుంటాడు

తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ! టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.కేసీఆర్ కి రాజకీయ అభద్రతా భావం ఎక్కువని … అందుకే అయన ఎప్పుడూ జోతిష్యాన్ని నమ్ముకుని.

 Narendhara Modi Telangana Tour Sensational Comments On Kcr1-TeluguStop.com

దానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటాడని ప్రధాని విమర్శలు చేశారు.కేసీఆర్‌ నిమ్మ, మిరపకాయల‌ను నమ్ముతారు అంటూ వ్యంగ్యంగా అభివర్ణించారు.

వాస్తు న‌మ్మ‌కంతో కెసీఆర్ స‌చివాల‌యానికి దూరంగా ఉండడమే కాకుండా… ఓ సారి చండీయాగం కూడా కేసీఆర్ నిర్వహించారని అంతే కాకుండా.ఫాంహౌస్ లో మ‌రో యాగం చేశారు అంటూ గుర్తు చేశారు.అంతే కాకుండా జ్యోతిష్యాన్ని న‌మ్ముకునే కెసీఆర్ ముంద‌స్తుకు వెళ్లార‌ని ఇప్పటికే అనేక మంది విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.తెలంగాణ అంత‌టా తాగునీళ్లు ఇచ్చాకే ఓటు అడుగుతానన్న కేసీఆర్‌.

ఐదేళ్లు పూర్తి కావొస్తున్నా నీళ్లు ఇవ్వలేదన్నారు.హామీలు మర్చిపోయిన కేసీఆర్‌ను ఇంటికి పంపాలని మోదీ పిలుపు ఇచ్చారు.

త‌ర్వాత మ‌హ‌బూబ్ న‌గ‌ర్ స‌భ‌లో మాట్లాడుతూ కూడా కెసీఆర్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.కేసీఆర్‌ మొదట చంద్రబాబు దగ్గర అప్రెంటీస్ చేశారని, తర్వాత సోనియా గాంధీ దగ్గర అప్రెంటీస్‌ చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు.

సోనియా రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వంలో కేసీఆర్‌ పనిచేశారని, చెంచాగిరి చేసే వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.ఇలాంటివారి చేతిలో మళ్లీ అధికారం పెడితే రాష్ట్రం అంధకారమే అవుతుందని అన్నారు.

జనం మీద బుల్లెట్లు కురిపించిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టొద్దని, కాంగ్రెస్‌కు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా చూడాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube