రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తున్నావు కదయ్యా..?  

Cpi Narayana Comments On Jagan Mohan Reddy About Amaravathi Issue - Telugu Amaravathi Peoples Strike, Ap Cm Jagan Mohan Reddy, , Narayana, Three Capitals In Ap

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే.పెద్ద ఎత్తున రాజధానుల విషయమై మీడియాలో చర్చ జరుగుతోంది.

Cpi Narayana Comments On Jagan Mohan Reddy About Amaravathi Issue

అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నారు.దేశ విదేశాల్లో కూడా అమరావతి రాజధాని గురించి ఆందోళనలు సాగుతున్నాయి.

ఈ సమయంలో సీపీఐ ముఖ్య నేత నారాయణ ప్రభుత్వంపై మరియు సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నాడు.

రాజధాని విషయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని నారాయణ తప్పుబట్టాడు.అసలు ఇలాంటి నిర్ణయం వల్ల జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోతుందని, మూడు రాజధానులు అంటూ ప్రచారం చేస్తుండటంతో నవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రాష్ట్రానికి మూడు రాజధానులు అక్కర్లేదని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.రాష్ట్రంను ఇష్టానుసారంగా నాశనం చేసే అధికారం మీకు ప్రజలు ఇవ్వలేదు.పరిపాలించేందుకు మాత్రమే అధికారం ఇచ్చారని నారాయణ అన్నారు.

CPI-Narayana On-Jagan-Mohan-Reddy Amaravathi నవ్వుల పాలు

తాజా వార్తలు