తన పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన ఆర్. నారాయణ మూర్తి…!  

narayana murthi spokes about his political carrier narayana murthi, ys rajashekar reddy, political entry, politics, andhrapradesh, kakinada, thuni - Telugu Andhrapradesh, Kakinada, Narayana Murthi, Political Entry, Politics, Thuni, Ys Rajashekar Reddy

పీపుల్ స్టార్.ఈ పేరు చాలా మందికి తెలియక పోయినా ఆర్.

TeluguStop.com - Narayana Murthi Spokes About His Politicals Carrier

నారాయణ మూర్తి అంటే ఇట్లే గుర్తుపట్టేస్తారు తెలుగు ప్రజలు.సమాజానికి అవసరమైన ఎన్నో సినిమాలను తెరకెక్కించడమే కాకుండా అందులో నటించి మెప్పించాడు.

ఎర్రసైన్యం, ఒరేయ్ రిక్షా, చీమలదండు లాంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల ను ఎంతగానో ఆకట్టుకున్నారు.

TeluguStop.com - తన పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన ఆర్. నారాయణ మూర్తి…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఆయనను ఎన్నికల్లో పోటీ చేయండి అంటూ వివిధ పార్టీల నుండి అనేక ఆఫర్స్ రావడం సహజమే.

అయితే ఆయన ఎన్ని ఆఫర్స్ రావడం ఎంత కామోనో, చివరికి అన్ని ఆఫర్స్ ను కూడా తిరస్కరించడం కూడా అంతే కామన్.ఇక తాజాగా ఆయన ఓ గ్రామంలో ఆలయ కమిటీ ఏర్పాటు నిమిత్తం సమావేశం నేపథ్యంలో ఆయన తన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పందించారు.

ఇందులో భాగంగానే తనకి కాకినాడ నుండి ఎంపీగా పోటీ చేయమని తనకి నాలుగు సార్లు అవకాశం లభించిందని, అంతేకాకుండా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను తుని ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారని కూడా తెలియజేశారు.అంత పెద్దాయన అడిగినా కూడా నారాయణ మూర్తి సున్నితంగా తనకు రాజకీయాల్లో ప్రవేశించాలని ఎలాంటి ఆశ లేదని తెలియజేశారు.

ఇక కరోనా నేపధ్యం తర్వాత తాను ఓ నాలుగు సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకొని, తాను భారతదేశమంతా పర్యటిస్తానని తెలియజేశారు.అలాగే ఓ చిన్న ఇల్లు నిర్మించుకుని తన శేష జీవితాన్ని అక్కడే గడిపేస్తా అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత తన కొత్త సినిమా ‘యూనివర్సిటీ’ ని ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.ఆర్.నారాయణ మూర్తి ఎక్కడికి బయటికి వెళ్లిన ఎలాంటి హంగు, ఆర్బాటం ఎక్కడ కనపడవు.

#Politics #Kakinada #Narayana Murthi #Political Entry #Andhrapradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Narayana Murthi Spokes About His Politicals Carrier Related Telugu News,Photos/Pics,Images..