నందమూరి తారకరత్నకు ఇటీవల లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో ఒకసారి గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు.
అయితే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబందించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో తారకరత్న పేరు మారి మోగిపోతోంది.
తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులను కుటుంబ సభ్యులు దేవుళ్లకు పూజలు చేస్తున్నారు.

అంతేకాకుండా ఇప్పటికే నందమూరి ఫ్యామిలీలో చాలామంది హాస్పిటల్ లో ఉన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే కుటుంబ సభ్యులతో పాటు నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హెల్త్ బులెటెన్ ను విడుదల చేశారు వైద్యులు.ఈ సందర్భంగా వైద్యులు తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు.
ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.అయితే తారక రత్నకు ఎక్మో సపోర్ట్‌తో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారని వస్తున్న వార్తలపై కూడా వైద్యులు స్పందించారు.
ఆయనకు ఎక్మో సపోర్ట్ పెట్టలేదని తాజాగా నిన్న సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు.

అలాగే హాస్పిటల్ వద్ద ప్రజలు, అభిమానులు ప్రైవసీ కల్పించాలని, చికిత్సకు ఎటువంటి అంతరాయం కల్పించకూడదని వైద్యులు విజ్ఞప్తి చేశారు.అయితే హెల్త్ బులెటెన్ విడుదల చేయక ముందు తారకరత్న బాబాయ్ నందమూరి రామకృష్ణ మాత్రం, తారకరత్న తనకు తానుగా శ్వాస తీసుకుంటున్నారని ఆర్గాన్స్ అన్నీ బాగున్నట్లు వివరించిన విషయం తెలిసిందే.అవయవాలు అన్నీ పనిచేస్తున్నట్లు తెలిపారు.
తారకరత్న ప్రజంట్ వెంటిలేటర్‌పై ఉన్నారని మధ్యాహ్నం 1:30 గంటలకు సీటీ స్కాన్ తీశారని ఆ రిపోర్ట్ వచ్చిన తరువాత మెదడు పనితీరు తెలుస్తుందని వెల్లడించారు.
