ఒక్కరోజులో బెంగళూరు ఆసుపత్రి ఘనత.. ఏకంగా గిన్నిస్ బుక్‌లో చోటు..

ఆసుపత్రులు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి.నిత్యం ఏదో ఒక అనారోగ్యంతో ప్రజలు ఆసుపత్రులకు వెళ్తుంటారు.

 Narayana Health Enters Guinness Book Of World Records By Conducting 3797 Ecgs In-TeluguStop.com

ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నప్పుడు ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు.అయితే ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారణ చేసేందుకు కొన్ని పరీక్షలను చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

తద్వారా ఆ రోగికి గల అనారోగ్యాన్ని వారు అంచనా వేసి చికిత్స అందిస్తారు.ఇదే కోవలో బెంగళూరు నారాయణ హెల్త్ సిటీ( Bangalore Narayana Health City ) అరుదైన ఘనతను సాధించింది.

కేవలం ఒక్క రోజులోనే అత్యధిక ఎలక్ట్రో కార్డియోగ్రామ్ స్క్రీనింగ్‌లు (ఈసీజీ)( Electrocardiogram Screenings ) నిర్వహించింది.ఇలా చేసి ప్రపంచంలో మరే ఇతర హాస్పిటల్‌కు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది.

అంతేకాకుండా ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో( Guinness Book of Records ) చోటు దక్కించుకుంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.బెంగళూరుకు చెందిన నారాయణ హెల్త్ సిటీ బాగా పేరొందింది.ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులకు ఇక్కడ ప్రత్యేక చికిత్స అందుతుంది.

సెలబ్రెటీలు సైతం ఇక్కడికే వస్తుంటారు.

Telugu Bangalore Yana, Guinness, Latest, Rare Feat-Latest News - Telugu

తాజాగా ఈ ఆసుపత్రిలో 24 గంటల్లో 3,797 ఎలక్ట్రో కార్డియోగ్రామ్ స్క్రీనింగ్‌లు (ఈసీజీ) నిర్వహించారు.ఈ రికార్డును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ వారు గుర్తించారు.ఆసుపత్రికి వచ్చి గిన్నిస్ రికార్డు అందజేశారు.

ఒక రోజులో ఏ ఆసుపత్రిలోనైనా అత్యధిక ఈసీజీలు( ECG ) చేయడం ఇదే తొలిసారి.గురువారం ఆసుపత్రి ఈ ఘనత సాధించింది.శుక్రవారం నారాయణ హెల్త్ సర్టిఫికేషన్ పొందింది.24 గంటల్లో అత్యధిక ఎలక్ట్రో కార్డియోగ్రామ్ స్క్రీనింగ్‌లు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్లు నారాయణ హెల్త్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Telugu Bangalore Yana, Guinness, Latest, Rare Feat-Latest News - Telugu

“ఈ విశేషమైన ఫీట్ నారాయణ హెల్త్ ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించిపెట్టింది, ఆరోగ్య సంరక్షణలో అత్యుత్తమంగా అభివృద్ధి చెందాలనే దాని నిబద్ధతను పటిష్టం చేసింది.ఈ రోజు నారాయణ హెల్త్ సర్టిఫికేషన్ పొందింది” అని సంస్థ ఆ ప్రకటనలో పేర్కొంది.నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, డాక్టర్ దేవి శెట్టి మాట్లాడుతూ: “హెల్త్ స్క్రీనింగ్ గురించి అవగాహన కల్పించడం, గుండె జబ్బుల నివారణకు రెగ్యులర్ చెకప్‌ల ప్రాముఖ్యత గురించి మాత్రమే మా ప్రయత్నం జరిగింది” అని వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube