దేశ ప్రధాని నరేంద్ర మోడి పై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ సంచలన వ్యాఖలు చేశారు.విషయం ఏమిటంటే.
బీజేపీ మతోన్మాదంపై విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో నారాయణ ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఘర్ కీ వాపసీలో భాగంగా “మోడీ….
భార్యను ఇంటికి తెచ్చుకో” అంటూ నారాయణ డిమాండ్ చేశారు.అంతేకాకుండా సంఘ్ పరివార్ నేతలు హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.
సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించాలని వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రులను వారి పదవుల నుంచి తొలగించాలని సైతం నారాయణ ఘాటుగా స్పంధించారు.ఇదే క్రమంలో ఒబామా పర్యటనపై కూడా నారాయణ ఘాటుగా స్పందించారు.
ఒబామా పర్యటన కార్పొరేట్ సంస్థలకే తప్ప దేశ ప్రజలకు ఎలాంటి లాభం లేదని అన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమర్థవంతమైన పాలన కావాలని కోరుకుంటున్నారే తప్ప అందమైన భవనాలు కావాలని కోరుకోవడం లేదని తెలిపారు.
ఇక ఆతరువాత వెంకయ్య నాయుడుపై కూడా నారాయణ విమర్శలు చేశారు.ఏది ఏమైనా నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రాజకీయాల్లో పెను దుమరాన్నే రేపుతున్నాయి.