ఫీజులు కోసం విద్యార్ధిని వేధింపులు గురి చేసిన నారయణ విద్యా సంస్థలను తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేయాలి..ఎస్.ఎఫ్.ఐ డిమాండ్.

హైదరాబాద్: రామాంతపూర్ నారయణ విద్యాసంస్థలో నారయణ స్వామి అనే విద్యార్ధి ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని లేకుంటే ఇవ్వమని జాఫ్యం చేసి టిసి ఇవ్వకపోవడంతో విద్యార్ధి ఈరోజు ఆత్మహత్య యత్నం చేశాడు.ఈ సంఘటన ఎస్.

 Narayana Education Institutes Should Be Abolished In Telangana State For Harassi-TeluguStop.com

ఎఫ్.ఐ.పట్ల విచారం వ్యక్తం చేస్తుంది.

ఈ ఒక్క ఘటనే కాదు కార్పోరేట్ విద్యాసంస్థలైన నారయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు గత అనేక సంవత్సరాలు నుండి ఫీజులు విపరీతంగా పెంచుతూ, తీవ్రమైన ఒత్తిడి తల్లిదండ్రులు, విద్యార్ధులపై చేస్తున్నారు.

ఈ ఫీజులు ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది విద్యార్ధులు తమ తనువు చాలించారు.అయినా ప్రభుత్వాలు అధికారులు మాత్రం స్పందించడం లేదు.ఈ ఘటన వారి ఒత్తిడి, దోపిడీ ఎంత ఉందో తెలియజేసేందుకు ఉదహరణ.తెలంగాణ రాష్ట్రంలో కార్పోరేట్ విద్యాసంస్థల మోసాలు భాద్యత కల్గిన విద్యార్ధి సంఘం గా ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన ఈ ఘటనపై స్పందించలేదు.

నిబంధనలు పాటించకుండా ,లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు.

కార్పోరేట్ కళాశాలల వేధింపులు నిత్య కృత్యంగా మారాయి.

కార్పోరేట్ కళాశాలల యాజమాన్యాలు దోపిడీ ఒత్తిడి ఇబ్బందులు పై ఇంటర్మీడియట్ బోర్డు తక్షణమే కమిటి వేసి విచారించి కార్పోరేట్ నారయణ, శ్రీచైతన్య దోపిడి పై చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ.కోరుతుంది.ఈ ఘటనకు పాల్పడిన నారయణ కళాశాలను రద్దు చేసి ఫీజులు నుండి విముక్తి కల్గించాలి.అలాగే విద్యార్ధులు తమ ప్రాణాలను త్యాగం చేయకుండా కార్పోరేట్ కళాశాలలపై పోరాటంలో పాల్గోనాలని ఎస్.ఎఫ్.ఐ.పిలుపునిస్తుంది.ఈ సందర్బంగా విద్యార్ధికి న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేసిన ఎస్.

ఎఫ్.ఐ.మరియు డివైఎఫ్ఐ నాయకత్వాని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మలక్ పేట పోలీసు స్టేషన్ కు తరలించడాని ఎస్.ఎఫ్.ఐ.ఖండిస్తూ తక్షణమే వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది.ఈ ఘటనకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube