రాజు గారు క్రమక్రమంగా బీజేపీ ఎంపీగా మారిపోతున్నారే ?

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి.ఆయన జగన్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా బీజేపీ నేతలతో కలిసి తిరుగుతుండడం జగన్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.

 Narasapuram Ycp Mp Raghu Ramakrishnam Raju Turn In To Bjp-TeluguStop.com

తనకు పార్టీతో సంబంధం లేదు, తాను స్వతంత్రుడుని అన్నట్టుగా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారు.ఢిల్లీలో కేంద్ర పెద్దలు కానీ, మరే ఇతర పార్టీ నేతలతో గాని ఏదైనా వ్యవహారాలు చేయాలన్నా,వారిని కలవాలన్న తప్పనిసరిగా ఎంపీలు విజయ సాయి రెడ్డితో కానీ, మిథున్ రెడ్డి ని సంప్రదించి వారి అంగీకారం వచ్చిన తర్వాత మాత్రమే ఎవరినైనా కలవాలని వైసిపి తమ ఎంపీలకు ఎప్పుడో హెచ్చరికలు చేసింది.

ఈ హెచ్చరికలను అందరు ఎంపీలు పాటిస్తున్నారు.కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తనంతట తానుగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

Telugu Sapuramycp, Ycpjagan, Ycpmp-

కేంద్ర మంత్రులు అందరిని తరుచుగా కలుస్తున్నారు.అసలు ఎందుకు వెళ్తున్నారు సందర్భం ఏదైనా ఉందా అనే విషయం పార్టీకి సమాచారం ఉండడం లేదు.పోనీలే కలిస్తే కలిసారు అసలు ఎందుకు కలిశారు వివరాలు చెప్పమన్నా రఘురామకృష్ణంరాజు పట్టించుకోవడం లేదట.నిన్న రాత్రి బీజేపీ చీఫ్ అమిత్ షాతో రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు.

ఆ తర్వాత అనేక మంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.వైసిపితో తనకు సంబంధం లేదు, తాను బిజెపి ఎంపీ అన్నట్టుగా రఘురామకృష్ణంరాజు వ్యవహరించడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

అది కాకుండా ఈ రోజు బిజెపి నాయకులను కలిసేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

Telugu Sapuramycp, Ycpjagan, Ycpmp-

తూర్పు కాపులను ఓబీసీల్లో చేర్చాలంటూ కేంద్ర మంత్రితో చర్చించేందుకు రఘురామకృష్ణంరాజు ప్లాన్ చేసుకున్నారు.అయితే ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పనేలేదు.దీంతో ఆయన క్రమక్రమంగా బిజెపిలోకి వెళ్లేందుకు ఈ విధంగా చేస్తున్నారని వైసిపి అనుమానిస్తోంది.

గతంలో రఘురామకృష్ణంరాజు అమరావతికి పిలిపించి మరి జగన్ గట్టిగా క్లాస్ పీకారు.ఆ తరువాత కొద్ది రోజులు సైలెంట్ గానే ఉన్నట్లు కనిపించినా మళ్ళీ యథా స్థితికి వచ్చారు.

ప్రస్తుతం వైసీపీని లెక్క చేసే స్థితిలో ఆయన కనిపించడం లేదు.క్రమక్రమంగా బీజేపీకి దగ్గరయ్యే ఏదో ఒక సందర్భంలో బిజెపి తీర్థం పుచ్చుకున్న ఆశ్చర్యపడక్కర్లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube