జగన్ ను కలిసి వివరణ ఇచ్చిన నరసాపురం ఎంపీ

బిజెపిలోకి వెళ్ళిపోతున్నాడుఅంటూ కొద్ది రోజులుగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు మీద అనేక కథనాలు వస్తున్నాయి.దీనికి తగ్గట్టుగానే ఆయన ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కలవడం, మరో సందర్భంలో ప్రధాని రఘురామకృష్ణం రాజును దగ్గరకు పిలిచి భుజం తట్టడం ఇవన్నీ బీజేపీలోకి వెళ్లేందుకు సంకేతాలు అన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

 Narasapuram Mp Raghurama Krishanam Raju Meets To Jagan-TeluguStop.com

తాజాగా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తమతో వైసీపీ ఎంపీలు టచ్లో ఉన్నారని, వారు బిజెపి లోకి వచ్చేందుకు సిద్ధం అంటూ ప్రకటించి రాజకీయ సంచలనం సృష్టించారు.

ఆయనలా ప్రకటించిన కొద్దిసేపటికే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ ను కలవడం చర్చనీయాంశమైంది.

అనంతరం మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణంరాజు తాను నియోజకవర్గ అభివృద్ధి గురించి జగన్ తో చర్చించానని,తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చానని చెప్పారు.తెలుగు అకాడమీపై పార్లమెంట్లో ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందో ఇచ్చానన్నారు.

అలాగే వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారు అంటూ సుజనా చౌదరి ఎందుకు చెప్పారో తనకు తెలియదన్నారు.ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే తాను అనేక సందర్భాల్లో ఆయనను కలిశానని, అందుకే నేను ఎక్కడ కనపడినా ప్రధాని గుర్తు పడతారని అని చెప్పారు.

వైసీపీ ఎంపీలు ఎవరు బిజెపితో కానీ , సుజనా చౌదరి తో కానీ టచ్ లో లేరని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube