నారప్ప వాయిదా.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన వెంకటేష్ !

సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు.వెంకటేష్ వరస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల కు పోటీగా నిలుస్తున్నాడు.

 Narappa Movie Postponed Due To Covid Crisis-TeluguStop.com

కుర్ర హీరోలు కూడా హిట్ కొట్టడానికి తడబడుతుంటే వెంకీ మామ మాత్రం చెప్పుకో దగ్గ హిట్స్ తో దూసుకు పోతున్నాడు.ప్రస్తుతం వెంకటేష్ మూడు సినిమాల ను లైన్లో పెట్టాడు.

ప్రస్తుతం వెంకటేష్ ఈ సినిమాల షూటింగ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

 Narappa Movie Postponed Due To Covid Crisis-నారప్ప వాయిదా.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన వెంకటేష్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నారప్ప సినిమా మే 14 న విడుదల అవ్వబోతుందని ముందుగా ప్రకటించారు.

అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ మొదలయి పోయింది.అందువల్ల ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చెయ్యలేని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నామని త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెంకీ తెలిపాడు.

Telugu Anil Ravipudi, Corona Second Wave, Covid Effect, Covid-19, Drushyam 2, F 3 Movie, Narappa, Narappa Movie Postponed Due To Covid Crisis, Narappa Postponed, Postponed, Priyamani, Suresh Babu, Venkatesh-Movie

అంతేకాదు అందరు ఇంట్లోనే ఉంటూ కరొన ను ఎదుర్కోవాలని.ప్రతి ఒక్కరు తప్పకుండ మాస్క్ పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన తెలిపారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమా తమిళం లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘అసురన్‘ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాను దగ్గుబాటి సురేష్ బాబు మరియు కళైపులి సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కు మణిశర్మ సంగీతం అందించాడు.వెంకటేష్ ఈ సినిమాతో పాటు F3, దృశ్యం 2 సినిమాలు చేస్తున్నాడు.

దృశ్యం 2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది.మరొక సినిమా F3 షూటింగ్ దశలో ఉంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

#Postponed #Narappa #Anil Ravipudi #F 3 Movie #Covid Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు