అమరావతిని కృష్ణమ్మ ముంచేయడం కాదు, అసెంబ్లీని జనాలు ముంచెత్తారు

రాజధాని వికేంద్రీకరణ విషయమై నేడు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పర్చిన విషయం తెల్సిందే.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు అంతా కూడా అసెంబ్లీని ముట్టడించేందుకు సిద్దం అయ్యారు.

 Naralokesh Tweet On Ycp Leaders-TeluguStop.com

ఇప్పటికే పలు ప్రాంతాల నుండి అసెంబ్లీ వైపుగా జనాలు తరలి వచ్చారు.పోలీసులు వారిని ఎక్కడి వారిని అక్కడే అరెస్ట్‌లు చేస్తూ జనాలు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

పెద్ద ఎత్తున జనాలు ప్రస్తుతం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అసెంబ్లీకి ఒక వైపు నుండి జనాలు పోలీసుల రక్షణ వలయంను ఛేదించి అసెంబ్లీ వైపుగా దూసుకు వెళ్లారు.

ఆ వీడియోలను మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.అమరావతిని కృష్ణమ్మ ముంచెత్తుతుందని వైసీపీ నేతలు అబద్దపు ప్రచారం చేసారు.ఇప్పుడు నిజంగా ఈ జనప్రవాహం అసెంబ్లీ ప్రాంతాన్ని ముంచెత్తడాన్ని చూడండి.మహిళలు, పిల్లలు సైతం ప్రభుత్వ నిర్బంధనాలను చేధించుకుని ఎలా వెల్లువెత్తారో చూసాక కూడా ప్రభుత్వం మొండి నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వం కాదా? అంటూ వీడియోకు లోకేష్‌ కామెంట్‌ పెట్టాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube