మంత్రిగా లోకేష్ అట్టర్ ఫ్లాప్..రీజన్ ఇదేనా..?       2018-06-18   00:41:00  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి రాజకీయ చాణిక్యుడిగా పేరు ఉంది..జీతీయ స్థాయి రాజకీయాలలో సైతం చక్రం తిప్పగల నేత చంద్రబాబు..అయితే చంద్రబాబు రాజకీయాలని తన కొడుకు అయిన లోకేష్ ప్రస్తుత ఏపీ ఐటీ మరియు పంచాయతీ శాఖామంత్రి పుణికి పుచ్చుకోలేక పోతున్నాడు అనేది వాస్తవం అంటున్నారు. తన శాఖాపరంగా వచ్చే సవాళ్ళని ఎదుర్కోలేకపోవడం మాత్రమే కాదు లోలోపల జరుగుతున్న పైరవీలు ఆ పైరవీలకి కారణం అవుతున్న వారిపై కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా సచివాలయంలో పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ పేరుతో కొందరు మధ్యవర్తులు దోచుకుంటున్నారని, లక్షలు వసూలు చేస్తున్నారని కొన్ని పనులు చక్కపెట్టి, మరి కొన్ని పనులు చక్కపెట్టడం లేదని తెలుస్తోంది…అంతేకాదు ఒక క్రింది స్థాయి అధికారి ఇక్కడ గ్రూప్ లని ఏర్పాటు చేసి మరీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లతో మాట్లాడించి..పరోక్షంగా బెదిరిస్తూ..లక్షలు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది అయితే ఈ విషయం లోకేష్ కి ఇంకా తెలుసో తెలియదో అయితే…

పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణశాఖ డైరెక్టర్‌గా నిన్న మొన్న ఐఎఎస్‌తో జాయింట్‌ కలెక్టర్‌ హోదాతో ఉన్న ‘రంజిత్‌భాషా’ ను ఏకంగా ఆ శాఖకి సంభందిచిన డైరెక్టర్ హోదా కల్పించడం ఎంతవరకూ సబబు..అయితే ఈ ఘనత ఎవరికీ దక్కుతుంది లోకేష్ కి కాదా…13 జిల్లా కలెక్టర్లు, అంత కన్నా జానియర్‌ అయిన ‘రంజిత్‌భాషా’ను అత్యంత ప్రాధాన్యత కల, సీనియర్‌ అధికారి నిర్వహించాల్సిన పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖను నిర్వీర్యం చేశారని, పరిపాలనా వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నారని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…సరే ఈ విషయం పక్కన పెడితే..

డ్వామా పీడీ గా ఒక అధికారిని నియమించాలంటే ఆర్‌డిఒ స్థాయి అధికారిని ఎండిఒగా అనేక సంసవత్సరాలుగా పనిచేసిన అధికారిని కానీ..డ్వామా పిడిగా నియమించే సాంప్రదాయం ఉంది. కానీ లోకేష్ ఇవేమీ పట్టించుకోకుండా నాశాఖ నాయిష్టం నేను చెప్పినట్టు జరిగితీరాలి అనుకుంటే ఎంతవరకూ సబబు అంటూ సీనియర్ అధికారులు లోకేష్ పై గుర్రుగా ఉన్నారట…ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి ఎలా చెప్పాలో అర్థం కాక కొందరు అధికారులు తర్జన బర్జన పడుతున్నారు.

అయితే ముఖ్యమంత్రికి తెలియకుండానే అన్ని నియామకాలు జరుగుతాయా..? “రంజిత్‌భాషా” నియామకం అలానే జరిగిందా అంటే ఛాన్స్ లేదంటున్నారు మరి అలాంటప్పుడు చంద్రబాబు లోకేష్ చేస్తున్న తప్పులకి ఎందుకు అడుకట్ట వేయడం లేదు..? అంటే నోరెళ్ళ బెట్టాల్సిందే..సమర్థులు, నిజాయితీపరుల సేవలను సద్వినియోగం చేసుకుంటూఅ ఎవరికీ ఎటువంటి భాద్యతలు అప్పగించాలో ఇప్పటికీ లోకేష్ తెలుసుకోక పోతే ఎలా తన శాఖలో జరుగుతున్న ఈ తప్పులనే కంట్రోల్ చేయలేని లోకేష్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారు అంటున్నారు అధికారులు.