ఏపీ సీఎం పై లోకేష్ బాబు సెటైర్లు

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత కుమారుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ సెటైర్లు వేశారు.29 వేలమంది అమరావతి రైతుల పిటీషన్ పై వీలైనంత త్వరగా విచారణ ముగించాలి అంటూ హైకోర్టు ను కోరిన సీఎం గారు ఆయన లక్షల కోట్లు ప్రజాధనం దోచేసిన 11 కేసుల విచారణ కు మాత్రం ఆయన సహకరించలేకపోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.అమ‌రావ‌తిని చంపేందుకు త్వ‌రగా కోర్టులో విచార‌ణ పూర్తిచేయాల‌ని అడుగుతున్నజగన్ గారు రూ.లక్ష కోట్ల ప్ర‌జాధ‌నం దోచేసిన 11 కేసుల విచార‌ణ త్వ‌ర‌గా పూర్త‌య్యేందుకు స‌హ‌క‌రించాలని కోరారు.అవినీతి కేసులో కోర్టుకి వెళ్లకుండా ఉండేందుకు, విచారణ ఆలస్యం అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని… కోవిడ్ వైర‌స్ భ‌యం వ‌ల్ల ఓసారి, కోర్టుకి రావాలంటే రూ.60 ల‌క్ష‌ల‌వుతుందని మ‌రోసారి, గ‌తంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్నాను రాలేన‌ని, ఇప్పుడు ప్ర‌భుత్వాధినేత‌గా ఉన్నాను కోర్టుకి హాజ‌రు కాకుండా మిన‌హాయింపు నివ్వాల‌ని ఇలా పదే పదే ఈ కేసు విచారణను అడ్డుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.ఈ కేసు ల విచారణను తప్పించుకోవడం కోసం ‘రకరకాల పిటిషన్లు వేస్తూ 10 ఏళ్ళు గడిపేశారు.

 Lokesh Comments On Ap Cm Jagan , Naralokesh, Chandrababu, Tdp, Jagan Mohan Reddy, Ysrcp, Ap High Court, Coronavirus, Amaravathi Farmmars,-TeluguStop.com

29 వేల మంది రైతుల స‌మ‌స్య కేసు మాత్రం కొద్దీ రోజుల్లో తేలిపోవాలా అంటూ లోకేష్ ప్రశ్నించారు.మరోపక్క ఏపీ హైకోర్టు లో అమరావతి రైతులు దాఖలు చేసిన పిటీషన్ పై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.సీఎం తో పాటు మరో ఇద్దరు క్యాబినెట్ మంత్రులకు కూడా ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

 Lokesh Comments On AP CM Jagan , Naralokesh, Chandrababu, TDP, Jagan Mohan Reddy, YSRCP, AP High Court, Coronavirus, Amaravathi Farmmars, -ఏపీ సీఎం పై లోకేష్ బాబు సెటైర్లు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube