టీడీపీలో నారా రోహిత్ ముచ్చటేంది ?  

nara rohith is telangana tdp president viral gosips spred Nara rohith, TDP, telangana, state president lokesh ,blood camp ,movies hero ,actor rammurthi naidu ,politics, ramana - Telugu Actor Rammurthi Naidu, Blood Camp, Movies Hero, Nara Rohith, Politics, Ramana, State President Lokesh, Tdp, Telangana

కొద్దిరోజులుగా తెలంగాణ టీడీపీ లో కలకలం రేగుతోంది.అక్కడ పార్టీ ఉన్నా, పెద్దగా యాక్టివ్ గా నాయకులు ఎవరు లేరు.

TeluguStop.com - Nara Rohith Is Telangana Tdp President Viral Gosips Spred

ఇప్పటికే టీడీపీ నుంచి కీలక నాయకులంతా అధికార పార్టీ టిఆర్ఎస్ బాటపట్టారు.మరి కొందరు రాజకీయ ప్రత్యామ్నాయం లేక టీడీపీలోనే సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.

ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సైతం పూర్తిగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టడం, అప్పుడప్పుడు మాత్రమే తెలంగాణ వ్యవహారాలకు సంబంధించి ఇక్కడ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మీటింగు లు నిర్వహించడం వంటివి జరుగుతూ వస్తున్నాయి.మొన్నటి ఎన్నికల్లో కూటమితో పొత్తు పెట్టుకుని టీడీపీ ఎన్నికలకు వెళ్లినా, కేవలం రెండు అసెంబ్లీ స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది.

TeluguStop.com - టీడీపీలో నారా రోహిత్ ముచ్చటేంది -Political-Telugu Tollywood Photo Image

దీంతో ఇప్పుడు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా టీడీపీ పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు.

బలం లేనిచోట పోటీచేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అనే ఆలోచనలో ఆ పార్టీ ఉంది.

దాదాపుగా తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోతుంది అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా చంద్రబాబు సోదరుడి కుమారుడు హీరో నారా రోహిత్ పేరు తెరపైకి వచ్చింది.ఆయనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాబోతున్నాడని, పార్టీని ఆయన సారథ్యంలో ముందుకు నడిపిస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తోంది.

అసలు దీనంతటికీ కారణం అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ ను నిర్వహించ తలపెట్టారు.దీనికోసం ప్రచారం చేసేందుకు నారా రోహిత్ ముందుకు వచ్చారు.

ఈ మేరకు తలసేమియా బాధితుల కోసం తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ఓ మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారని, దీని కోసం తెలంగాణ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మెగా బ్లడ్ క్యాంప్ ను విజయవంతం చేయాలని కోరుతూ నారా రోహిత్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

దీంతో ఆయన కాబోయే టీడీపీ అధ్యక్షుడు అనే ప్రచారం మొదలైంది.ఇప్పటికే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణపై ఆ పార్టీ నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్నారు.ఆయనను తప్పించాలనే డిమాండ్ లు ఎక్కువవుతున్నాయి.

చంద్రబాబు సైతం ఆయనను తప్పించి ఆ స్థానంలో చురుకైన యువ నాయకులకు ఆ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు.ఈ క్రమంలోనే నారా రోహిత్ పేరు తెరపైకి రావడం వెనుక ఏదైనా రాజకీయం ఉందా అనే సందేహాలు మొదలయ్యాయి.

పార్టీలో నూతన ఉత్సాహం తీసుకువచ్చేందుకు కావాలనే ఈ గాసిప్ ను చంద్రబాబు ప్రచారం చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇందులో నిజం ఉన్నా , లేకపోయినా నారా రోహిత్ పేరు మాత్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో మారుమోగుతోంది.

.

#Telangana #Nara Rohith #Blood Camp #ActorRammurthi #Movies Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nara Rohith Is Telangana Tdp President Viral Gosips Spred Related Telugu News,Photos/Pics,Images..