రెజినాను భరించడం కష్టమే అంటున్న హీరోలు..!

ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ కొనసాగిస్తూ సూపర్ ఫాంలో ఉన్న హాట్ బ్యూటీ రెజినా వరుసెంట సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.రీసెంట్ గా జ్యో అచ్యుతానంద సినిమాతో హిట్ అందుకున్న రెజినా ఆ సినిమాను ముందునుండి నమ్ముతూ వచ్చింది.

 Nara Rohith And Naga Shourya Comments About Regina-TeluguStop.com

అంతా బాగానే ఉంది కాని రెజినాతో సినిమాలో నటించిన నారా రోహిత్, నాగ శౌర్యలు మాత్రం రెజినాను భరించడం కష్టమే అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
జ్యో అచ్యుతానంద సక్సెస్ పట్ల హ్యాగా ఉన్న చిత్రయూనిట్ తో ఓ ప్రముఖ దినపత్రిక ఆ సినిమాలో నటించిన ఇద్దరు హీరోలను ఇంటర్వ్యూ చేసింది.

అయితే సినిమా సక్సెస్ పట్ల తమ అభిప్రాయాలను పంచుకున్న రోహిత్, శౌర్య జ్యో లాంటి అమ్మాయి తమ లైఫ్ లో తగలలేదని ఇంకా చెప్పాలంటే రెజినాను రీల్ లైఫ్ లో భరించ వచ్చేమో కాని రియల్ లైఫ్ లో మాత్రం కష్టమే అని అనేశారు.నాగ శౌర్య చెప్పిన ఈ మాటలకు రోహిత్ కూడా సపోర్ట్ ఇచ్చాడు.

రెజినా చాలా ఇంటెలిజెంట్ హీరోయిన్ అని ఆమెతో స్క్రీన్ వరకు ఓకే కాని ఆఫ్ స్క్రీన్ మాత్రం అహా అంతా ఈజీ ఏం కాదు అనేస్తున్నారు ఈ ఇద్దరు హీరోలు.సో మొత్తానికి తన తెలివితేటలన్ని నారా రోహిత్, నాగ శౌర్యల మీదే చూపించిందో ఏమో కాని రెజినా అంటే వామ్మో అనేస్తున్నారు ఈ ఇద్దరు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube