వయసు తగ్గించుకొని కాలేజీ స్టూడెంట్ గా మారిపోయిన నారా రోహిత్

టాలీవుడ్ లో బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు నారా రోహిత్.కమర్షియల్ జోనర్ కి దూరంగా ఎప్పుడు కొత్తదనం ఉన్న కథలతో సినిమాలు చేసే నారా రోహిత్ నటుడిగా ప్రత్యేకమైన ఇమేజ్ ని కలిగి ఉన్నాడు.

 Nara Rohit College Students Look Viral, Tollywood, Telugu Cinema, South Cinema-TeluguStop.com

నారా రోహిత్ నుంచి సినిమా వస్తుంది అంటే అందులో ఏదో కొత్తదనం ఉంటుంది అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.అలాగే కొత్త దర్శకులకి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడంలో నారా రోహిత్ ముందు వరుసలో ఉంటాడు.

అయితే నారా రోహిత్ చివరిగా ఆటగాళ్ళుతో రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.అయితే ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్న ఇతనికి సక్సెస్ రేట్ తక్కువ.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు అయిన పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నాయి తప్ప కమర్షియల్ గా అతని సినిమాలకి పెద్దగా లాభాలు రాలేదనే చెప్పాలి.అయితే రెండేళ్ళ గ్యాప్ తీసుకున్న రోహిత్ తన ఫిట్ నెస్ మీద పూర్తిగా దృష్టిపెట్టాడు.

ఎవరికీ కనిపించకుండా ఎక్కువగా లుక్, ఫిట్ నెస్ విషయంలో శ్రద్ధ తీసుకొని కొత్త లుక్ లోకి వచ్చాడు.తాజాగా తన కొత్త లుక్ ను రోహిత్ ఫ్యాన్స్ కు పరిచయం చేశారు.

ఈ లుక్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.సన్నగా, ఫిట్ గా తయారైన రోహిత్, ఓ కాలేజీ స్టూడెంట్ లా కనిపిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.

మీసాలు లేకుండా, కూల్ గా కనిపిస్తున్న రోహిత్ చిత్రం వైరల్ అవుతోంది.త్వరలో ఆయన కొత్త చిత్రం ప్రారంభం కానుండగా, ఆ సినిమాకు సంబంధించినదే ఈ లుక్ అని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube