అక్రమ అరెస్టు అంటూ నారా లోకేష్ సంచలన కామెంట్స్..!!

ఇటీవల పోలీసులు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ని అరెస్టు చేయడం జరిగింది.హైకోర్టు లాయర్ శివారెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

 Nara Lokeshs Sensational Comments About Illegal Arrest-TeluguStop.com

దీంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రాయవరం లో టిడిపి పార్టీ శ్రేణులు రామకృష్ణ రెడ్డిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపడుతున్నాయి.తాజా ఘటన పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు.

ఇది అక్రమ అరెస్ట్ అంటూ ప్రభుత్వంపై మరియు పోలీసులపై తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు.

 Nara Lokeshs Sensational Comments About Illegal Arrest-అక్రమ అరెస్టు అంటూ నారా లోకేష్ సంచలన కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టినందుకే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష అనడానికి అనపర్తి సంఘటన చక్కటి ఉదాహరణ.

సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నాలు ఎన్ని చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది.కోర్టులో ఎన్నిసార్లు చివాట్లు తిన్నా కొంతమంది పోలీసులు వైకాపా నాయకులకు వంతపాడుతూనే ఉన్నారు.

చేస్తున్న ప్రతి తప్పుకి మూల్యం చెల్లించుకోక తప్పదు.తక్షణమే రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలి’ అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా రామకృష్ణారెడ్డి ని అదుపులోకి తీసుకుంటున్న వీడియో ఫుటేజీలను కూడా లోకేష్ షేర్ చేయడం జరిగింది.

#Anaparthi #Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు