జగన్ కు లోకేష్ లేఖ ! అయ్యబాబోయ్ ఈ రేంజ్ లోనా ..?

గత కొంత కాలంగా ఏపీ సీఎం జగన్  పై లేఖల రూపంలో విమర్శలు చేస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.ఏపీ లోని అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు.? ప్రభుత్వం చేస్తున్న తప్పులు.ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.తాజాగా 17 ప్రశ్నలను జగన్ కు రాసిన లేఖలో లోకేష్ సందించారు.

 Nara Lokesh Wrote A Letter Criticizing Jagan Details, Cbn, Jagan, Ysrcp, Ap, Tdp, Cbn, Nara Lokesh, Ap Government, Lokesh Letter, Ap Farmers, Cm Jagan Mohan Reddy, Ycp, Raitu Bharosa, Input Subsidy, Crop Holiday, Nara Lokesh Letter-TeluguStop.com

1.అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్ మోటార్ లకు మీటర్లు పెట్టి రైతుల మేడకు ఉరితాడు బిగించిన నీచుడు ఎవరు ?
  2.మూడేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క చిన్న పిల్ల కాలువలైనా తవ్వారా ?
  3.రైతుల నుంచి గత ఏడాది కొన్న ధాన్యం కు డబ్బులు ఇచ్చారా ? ఈ ఏడాది ధాన్యం కొన్నారా ?
  4.3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది ?
  5.  ఇన్ పుట్ సబ్సిడీ ఎక్కడ ?
  6.తుఫాన్లు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఎంత ఇచ్చారు ?
  7.  పంటల బీమా ప్రీమియం కట్టామన్నారు రైతులకు ఇన్సూరెన్స్ వర్తించలేదు ఎందుకు ?
 

8.12,,500 రైతు భరోసా ఇస్తామని, 7500 ఇస్తుంది ఎవరు ?
  9.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులను అసలు గుర్తించారా ?
  10.వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ పోషకాలు లాంటివి ఏమయ్యాయి ?
  11.కేంద్రం తెచ్చిన వ్యవసాయరంగ వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చిన మూర్ఖుడు ఎవరు ?
  12.ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో మర్చిపోయిన క్రాప్ హాలిడే మళ్లీ తీసుకు వచ్చిన అసమర్థుడు ఎవరు ?
  13.టిడిపి హయాంలో రైతులకు మూడు లక్షల వరకు వడ్డీ నిబంధనని కేవలం ఒక లక్ష కే పరిమితం చేసింది ఎవరు ?
 

 Nara Lokesh Wrote A Letter Criticizing Jagan Details, Cbn, Jagan, Ysrcp, AP, TDP, CBN, Nara Lokesh, Ap Government, Lokesh Letter, Ap Farmers, Cm Jagan Mohan Reddy, Ycp, Raitu Bharosa, Input Subsidy, Crop Holiday, Nara Lokesh Letter-జగన్ కు లోకేష్ లేఖ అయ్యబాబోయ్ ఈ రేంజ్ లోనా ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

14.రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉండడానికి కారకుడివి నీవు కాదా ?
  15.ముదిగొండ లో ఎనిమిది మంది రైతులను కాల్చిచంపిన మీ నాన్న గారి చరిత్ర మర్చిపోయారా ?
  16.సోంపేటలో తమ భూముల్ని లాక్కోవాలని ఆందోళన చేసిన రైతులు ఆరుగురిని కాల్చి చంపించింది మీ నాయన రాజశేఖర్ రెడ్డి కాదా ?
  17.రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తే టెర్రరిస్టుల్లా అమరావతి రైతులకు సంకెళ్లు వేసింది ఏ రాక్షసుడిని ఆదేశాలతో .?
  అంటూ సోషల్ మీడియా ద్వారా లోకేష్ జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube