మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన నారా లోకేష్

Nara Lokesh Visited Mangalagiri Constituency

మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్న నారా లోకేష్ మహానాడు, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో కూడా పర్యటించారు .ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా లోకే ష్   ప్రజల్ని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు  .

 Nara Lokesh Visited Mangalagiri Constituency-TeluguStop.com

లోకేష్ గెలిస్తే ఇళ్లు పీకేస్తారని ప్రచారం చేసారు.కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆర్కే దగ్గర ఉండి మరీ పేదల ఇళ్లు కూలుస్తున్నారు.

త్రాగునీరు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి, రోడ్లు వెయ్యడం లేదు, రెండున్నర ఏళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు.నిత్యావసర సరుకులు, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధర ,ఇంటి పన్ను పెంచేశారు .ఇళ్ల పట్టాలు ఇస్తామని మోసం చేసి ఇప్పుడు ఇళ్లు తొలగిస్తున్నారు.

 Nara Lokesh Visited Mangalagiri Constituency-మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన నారా లోకేష్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్రాగునీరు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి, రోడ్లు వెయ్యడం లేదు, రెండున్నర ఏళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు.

నిత్యావసర సరుకులు, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధర ,ఇంటి పన్ను పెంచేశారు.ఇళ్ల పట్టాలు ఇస్తామని మోసం చేసి ఇప్పుడు ఇళ్లు తొలగిస్తున్నారు.విద్యుత్ బిల్లు ఎక్కువొచ్చిందని, రకరకాల కారణాలు చూపి పెన్షన్స్ , రేషన్ కార్డు, సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తున్నారంటూ తమ సమస్యలను లోకేష్ కి వివరించిన మహానాడు ప్రాంత ప్రజలు.సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, మీ తరపున పోరాడతానని లోకేష్ హామీ.

ఆకాశంలో ఉన్న జగన్ భూమ్మీదకి రావాలి.రెండున్నర ఏళ్లలో తాడేపల్లి కొంప నుండి బయటకు అడుగు పెట్టలేదు.

సొంత జిల్లా ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోని ముఖ్యమంత్రి వరదలతో రాయలసీమ, నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జగన్ రెడ్డి గాల్లో ఒక రౌండ్ కొట్టొచ్చి ఇంట్లో పడుకున్నారు.హుద్ హుద్ , తిత్లీ వచ్చినప్పుడు చంద్రబాబు గారు స్వయంగా వెళ్లి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ అక్కడే ఉన్నారు.

తిత్లీ వచ్చినప్పుడు 21 రోజుల్లో వెయ్యి కోట్ల నష్ట పరిహారాన్ని రైతులకు అందిచాము.ఇప్పుడు కనీసం నష్ట పరిహారం అంచనా వేసే నాధుడు లేడు.

రైతులు తీవ్రంగా నష్టపోయారు,వరి ,శనగ, మిర్చి ఇలా పంటలన్ని దెబ్బతిన్నాయి.తక్షణమే పరిహారం అందించాలి.

జగన్ రెడ్డి గారు వచ్చిననాటి నుండి అన్నీ సమస్యలే.ఇసుక దగ్గర నుండి నిరుద్యోగం వరకూ అనేక సమస్యలు.

ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు.తమిళనాడు లో ఇండస్ట్రీయల్ సమిట్ పెడితే 25 వేల కోట్ల పెట్టుబడులు ఆ రాష్ట్రానికి వెళ్లాయి.

ప్రజల పై భారాన్ని పెంచుకుంటూ పోతున్నారు.పెట్రోల్, డీజిల్ ధరలు , విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను ,ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, ఇప్పుడు మళ్లీ వాహన రిజిస్ట్రేషన్ మీద పన్ను.

వాహనాలు కొనే వారిపై కూడా జగన్ రెడ్డి భాద్యుడే  .పెంచిన పన్నులు తగ్గించే వరకూ టిడిపి ప్రజలకు అండగా పోరాడుతుంది.

Telugu Ap Potics, Chandra Babu, Mangalagiri Constituency, Nara Lokesh, Tdp Party, Ys Jagan, Ysrcp-Political

జగన్ రెడ్డి తుగ్లక్ 3.0 మాట మార్చడం, మడమ తిప్పడం ఆయనకి అలవాటుగా మారింది.ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చెయ్యలేదు.జగన్ రెడ్డికి ఏ సబ్జెక్ట్ మీదా అవగాహన లేదు.చట్టం తీసుకొచ్చే ముందు ఇవ్వన్ని తెలియదా? కనీస అవగాహన లేకుండా సౌత్ ఆఫ్రికా, మూడు రాజధానులు అన్నారు.మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసారా?మా తల్లిని అవమానించి ఆ అంశాన్ని పక్కదారి పట్టించడానికి కొత్త అంశాలు తెరపైకి తెచ్చారు.అప్పుడు వద్దు అన్న మండలి ఇప్పుడు ముద్దైంది.అందుకే ఆయన మాట మారుస్తాడు, మడమ తిప్పుతాడు అనేది మంగళగిరి లో అభివృద్ధి ఆగిపోయింది.రాష్ట్రానికి నడిబొడ్డున ఉండే మంగళగిరి లో ఎంతో అభివృద్ధి చెయ్యొచ్చు.ముఖ్యమంత్రి ఉండే నియోజకవర్గమైనా అభివృద్ధికి నోచుకోవడం లేదు.

అభివృద్ధి అంతా పేపర్లకే పరిమితం అవుతుంది.నిధులు విడుదల కావడం లేదు.

తాడేపల్లి ప్రాంతానికి త్రాగు నీరు అందించేందుకు టీడీపీ ప్రభుత్వం 110 కోట్లు కేటాయించింది.పైసల కోసం కాంట్రాక్టర్లను బెదిరించి ఆఖరికి ఆ ప్రాజెక్ట్ ను కూడా ఆపేశారు.

#Ysrcp #YS Jagan #Chandra Babu #Potics #TDP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube