జగన్ పై నారా లోకేశ్ సంధించిన విమర్శనాస్త్రాలు.. ఇందులో కొత్తేముంది చిన్నబాబు.. ?

నేటి రాజకీయాలు రాచరికాన్ని తలపించేలా సాగుతున్నాయని అనుకోవడంలో సందేహం లేదట.ఎవరు గెలిస్తే ఏమిటి? రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందరు కలసికట్టుగా పనిచేయాలి.ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలి కానీ నేటి రాజకీయాలు మాత్రం పదవులు ఎలాపొందాలి అనే అంశం చుట్టూనే తిరుగుతున్నాయని అనుకుంటున్నారట.ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం ఇలాంటి రాజకీయాలే నడుస్తున్నాయని కొందరి వాదన.

 Nara Lokesh Slams Cm Jagan-TeluguStop.com

అసలు రాజకీయ నేతలకు విమర్శలు చేసుకోందే నిద్దుర కూడా పట్టదు కావచ్చూ అందుకే రోజు ఏదో ఒక విషయంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పొద్దుగడిపేస్తున్నారని ఏపీ ప్రజల మనోవేదనట.ఇకపోతే ఏపీ సీఎం జగన్ పై టీడీపీ చిన్న బాబు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.

జగన్ రెండేళ్ల పాలనలో విధ్వంసం, విద్వేషం రెండు కళ్లుగా సాగుతున్నాయని విమర్శించారు.అదీగాక ప్రభుత్వ ట్యాక్స్ లకు అదనంగా జగన్ ట్యాక్స్ తోడవడంతో అన్ని రేట్లు పెరిగాయని వ్యంగ్యాస్త్రాలు వదిలారు.

 Nara Lokesh Slams Cm Jagan-జగన్ పై నారా లోకేశ్ సంధించిన విమర్శనాస్త్రాలు.. ఇందులో కొత్తేముంది చిన్నబాబు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పనిలో పనిగా పెట్రోల్ ధరలను కూడా ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు.అయినా ఇవన్ని పాత విషయాలే కదా చిన్న బాబు ఇందులో కొత్తే ముంది.

జనం నోరు మెదపకుండా అనుభవిస్తున్నారు, మోడీ జపాన్ని చేస్తున్నారు.ఇంకేదైనా కొత్త విషయం ఉంటే చెప్పండి అని అనుకుంటున్నారట జనం

.

#Nara Lokesh #CM Jagan #Slams

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు