ఏపీలో కీలకమైన ఓ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పుడు మంత్రి లోకేశ్ పెత్తనం సాగుతోంది.ఆ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి చిన్న ఇష్యూలోను లోకేశ్ వేలుపెట్టేస్తుండడంతో అక్కడ ఎంపీ పూర్తి డమ్మీ అయినట్టే కనిపిస్తోంది.
ప్రస్తుతం ఆ జిల్లాలోను, ఏపీ పాలిటిక్స్‌లోను ఇదే చర్చ హాట్ టాపిక్‌గా మారింది.ఏపీలో విజయవాడ ఎంపీ సీటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
రాజధాని అమరావతి కేంద్రంగా విజయవాడ ఉండడంతో ఇప్పుడు ఈ సీటు మీద గ్రిప్పింగ్ కోసం అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
ఇక ఇక్కడ నుంచి టీడీపీ ఎంపీ కేశినేని ప్రాథినిత్యం వహిస్తున్నారు.
ఆయన నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా బాగానే కష్టపడుతున్నారు.వన్ టైన్ ప్లైఓవర్, బెంజి సర్కిల్ ప్లై ఓవర్, టాటా ఫౌండేషన్ నిధులతో పాటు తన సొంత నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి బాగానే కృషి చేస్తున్నారు.
జనాల్లో మాస్ లీడర్‌గా కూడా పేరుంది.అయితే ఆయన నోటి దూకుడే ఆయనకు మైనస్‌గా మారుతోంది.
ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ఆయన పదే పదే చంద్రబాబును, ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయనకు పెద్ద మైనస్ అయ్యాయి.చంద్రబాబు, లోకేశ్ నానిని దూకుడు తగ్గించుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఆయన తీరు మాత్రం మారడం లేదు.
ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నానిని పక్కన పెట్టి తమకు అనుకూలమైన వ్యక్తిని రంగంలోకి దింపాలని బాబు, లోకేశ్ చేస్తోన్న ప్రయత్నాలు ఇప్పటికే నాని దృష్టికి రావడంతో నాని ఏ విషయంలో వెనక్కు తగ్గడం లేదు.
ఇదిలా ఉంటే ఇక్కడ లోకేశ్ వ్యూహాత్మకంగా పెత్తనం సాగిస్తున్నారట.
ఇక్కడ ఏదైనా పని అవ్వాలంటే తనకు చెప్పాల్సిందే అని లోకేశ్ ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న టీడీపీ నాయకులకు స్ట్రాంగ్‌గా చెప్పేసినట్టు తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో తన భార్య బ్రాహ్మణి లేదా తనకు కావాల్సిన వ్యక్తిని ఇక్కడ రంగంలోకి దింపేలా లోకేశ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని, అందుకే ఇక్కడ నానికి ఇప్పటి నుంచే చెక్ పెట్టే క్రమంలో ఈ నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారన్న గుసగుసలు టీడీపీలో వినిపిస్తున్నాయి.