హింసించే 24వ రాజు సీఎం జగన్ : లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు.అమరావతి ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ నారా లోకేష్ సిఎం జగన్ టార్గెట్ గా విమర్శలు చేసారు.

 Nara Lokesh Sensational Comments On Ys Jagan,cm Jagan, Naralokesh, Tdp ,ysrcp, Ycp, Ap Cm-TeluguStop.com

నేడు రాజధాని గ్రామాల్లో నారా లోకేష్ పర్యటిస్తున్నారు.అమరావతి రైతుల పోరాటం 300వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ… ముందుతరాలకు కూడా మేలు చేయడానికి దార్శనికతతో చేసే పనులు కొన్ని ఉంటాయి.

ఉదాహరణకు రాజధానిగా అమరావతి నిర్మాణం.వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వార్థపరులు చేసే పనులు కొన్ని ఉంటాయి.అదే మూడు రాజధానుల నాటకం.మూడు రాజధానులతో వచ్చే ముప్పు తెలుసుకుని అమరావతిని కాపాడుకుందాం అని అన్నారు.
జై అమరావతి ఉద్యమం మొదలై 300 రోజులు అయింది .హింసించే 24వ రాజు వైఎస్ జగన్ మాట మార్చి, మడమ తిప్పి నేటికి 300 రోజులు.అరెస్టులు, అవమానాలు, కేసులతో రాబందుల్లా వెంటాడుతున్నా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అంటున్న రైతులు, మహిళలు, యువత, ఉద్యమకారులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను’ అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ లో తెలిపారు.

 Nara Lokesh Sensational Comments On YS Jagan,cm Jagan, Naralokesh, Tdp ,ysrcp, Ycp, Ap Cm -హింసించే 24వ రాజు సీఎం జగన్ : లోకేష్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనస్సున్న వాడికి రైతు కష్టం తెలుస్తుంది.

మూర్ఖుడికి హింసించడం మాత్రమే తెలుస్తుంది.మనం మూర్ఖుడితో పోరాటం చేస్తున్నాం.

ఇదొక సుదీర్ఘ పోరాటం.ఓర్పు, సహనంతో ఉంటే అంతిమ విజయం మనదే.

” అని లోకేష్ ట్విట్ చేసారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube