జగన్ సైకో శాడిస్ట్ ఇంకా.. ఇంకా ?

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఏపీలో నిన్న టీడీపీ కార్యాలయాల పై జరిగిన దాడిని నిరసిస్తూ ఈరోజు ఆ పార్టీ ఆధ్వర్యంలో బందుకు పిలుపు ఇచ్చారు.

 Nara Lokesh Sensational Comments On Jagan  Jagan, Ap Cm, Ysrcp, Nara Lokesh, Lok-TeluguStop.com

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేత్తో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.నియోజకవర్గాల వారీగా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు టిడిపి శ్రేణులు చేపట్టాయి.

ఇక జగన్ పై లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడిని నీ వికృత క్రూర బుద్ది చూశాక సైకో శాడిస్ట్ , డ్రగ్గిస్ట్ వైఎస్ జగన్ అంటున్నారు.

నువ్వూ ,నీ బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తారు.నిలదీసే టీడీపీ నేతలపై దాడులకు పాల్పడతావా అంటూ లోకేష్ విమర్శలు చేశారు.

అంతకు ముందు మరో ట్విట్ లో ఇదే విధమైన కామెంట్స్ లోకేష్ చేశారు.

పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే .పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతావా ? టీడీపీ కేంద్ర కార్యాలయాలపై గూండా మూకలతో దాడులకు తెగబడతవా ? ఎన్నాళలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావు.నువ్వు రా తేల్చుకుందాం తెలుగు దేశం సహనం చేతకానితనం అనుకుంటున్నావా ? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పరుచుకుంటున్నావు.నిన్ను ఉరికించి కొట్టడానికి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు.నీ అరాచకాలపై ఆగ్రహం గా ఉన్న కేడర్ కి మా లీడర్ కనుసైగ చేస్తే చాలు.

అంటూ లోకేష్ విమర్శలు చేశారు.

కొద్ది రోజులుగా లోకేష్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడం లేదు.హైదరాబాద్ కే పరిమితమయ్యారు.టిడిపి అధినేత చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ తో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారనే కారణాలతో లోకేష్ అలక చెందారు అనే ప్రచారం నడిచింది.

అయితే నిన్న టిడిపి కార్యాలయంలో వైసీపీ నాయకులు దాడులు, తదితర పరిణామలతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ లో కదలిక వచ్చినట్టు కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube