థాంక్యూ మోదీ అంకుల్ ! ఆనందంలో లోకేష్  

ఏపీలో ఎంతో ఉత్కంఠ రేపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ విజయవంతంగా ముగిసింది. ఇక్కడ సభలో మోదీ తాను మాట్లాడాలనుకున్న మాటలన్నీ మాట్లాడేశాడు… తాను ఇన్నాళ్లు మనసులో దాచుకున్న అన్ని విషయాలను చెప్పేసాడు. బీజేపీ శ్రేణులన్నీ ఈ పర్యటన విజయవంతం అవ్వడంతో… హ్యాపీగా ఉన్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఈ పర్యటనపై మోదీ మీద, బీజేపీ మీద కారాలు మిరియాలు నూరేసారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి పదే పదే తన పేరు ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగిందని, అకస్మాత్తుగా ఎక్కడలేని గుర్తింపు వచ్చిందని భావిస్తున్నాడు.

Nara Lokesh Says Thanks To Narendra Modi-Nara Question Modi Narendra Meeting In Guntur

Nara Lokesh Says Thanks To Narendra Modi

మోదీ నోట గుంటూరులో జరిగిన సభలో లోకేష్ నామజపం వినిపించింది. కొన్ని సార్లు చంద్రబాబును లోకేష్ తండ్రి అంటూ ప్రస్తావించారు. తండ్రి కొడుకుల ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రభుత్వాన్ని వాళ్లిద్దరే నడిపిస్తారని వారిద్దరి కారణంగా వ్యవస్థ మొత్తం నాశనం అయిపొయింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. అయితే మోదీ ఈ రేంజ్ లో ఘాటు విమర్శలు చేసినా…. లోకేష్ పేరు పదే పదే ప్రస్తావించడం వెనుక కారణం ఏంటి అనే చర్చ మొదలయ్యింది. ఇప్పటి వరకు పప్పు ముద్రతో ఉన్న లోకేష్‌కు.. మోదీ దేశ వ్యాప్తంగా ఉచిత ప్రచారం కల్పించారని కొంతమంది విశ్లేషిస్తున్నారు.

Nara Lokesh Says Thanks To Narendra Modi-Nara Question Modi Narendra Meeting In Guntur

ప్రస్తుతం టీడీపీలో చంద్రబాబు తరువాత లోకేష్ కి అత్యంత ప్రాధాన్యం ఉంది. నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్నారు. అసలు ఈ విధంగా చేయడం కోసమే… ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని చంద్రబాబు చాకచక్యంగా పక్కనపెట్టేశారు. ఇదంతా తన కుమారుడు లోకేష్ ను ప్రమోట్ చేసుకునేందుకే అన్న విషయం అందరికి తెలుసు ఇపుడు మోఢీ కూడా అదే ప్రస్తావించాడు. మోదీ ఈ వారసత్వ రాజకీయాలను గురించి దెప్పి పొడిచేందుకు చాలా ప్రయత్నాలు చేసినట్టు కనిపించాడు. అయితే మోదీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ సీరియస్ గా తీసుకుంటే… లోకేష్ మాత్రం దీనికి భిన్నంగా చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు. అంటే మోదీ చేసిన వెటకారపు కామెంట్స్ ను లోకేష్ పాజిటివ్ గా తీసుకుని తృప్తి పొందుతున్నాడు.