జగనే టార్గెట్ గా సరికొత్త రూట్లో లోకేష్ ?- Nara Lokesh More Active On Politics

lokesh to directly target ap cm jagan, Devineni uma, TDP, ysrcp, ap, government cbn, Nara lokesh, chandra babu naidu, cm seat, yanamala rama krishnudu, ap politics - Telugu Ap, Ap Politics, Chandra Babu Naidu, Chandrababu, Cm Seat, Devineni Uma, Government, Jagan, Kalva Srinivasulu, Lokesh, Nara, Tdp, Yanamala Rama Krishnudu

మొదటి నుంచి రాజకీయంగా టీడీపీ యువ నాయకుడు లోకేష్ వ్యవహారంపై అనేక సందేహాలు పార్టీ నేతల్లో ఉంటూ వస్తున్నాయి.లోకేష్, చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో రాజకీయాలు చేయలేడు అనే అభిప్రాయం పార్టీ నేతలలోనూ, ప్రజలలోనూ వ్యక్తమైనా, చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించేది ఎవరు అనే సందేహాలు అందరిలోనూ ఉంటూ వచ్చాయి.

 Nara Lokesh More Active On Politics-TeluguStop.com

కానీ 2019 ఎన్నికల తర్వాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో లోకేష్ వ్యవహరించిన తీరు ఆ పార్టీ నేతలకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది.అదే పనిగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడమే కాకుండా, జగన్ ను టార్గెట్ చేసుకుంటూ లోకేష్ నిలదీస్తున్న తీరు పార్టీ శ్రేణులలోనూ, ప్రజల్లోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే , లోకేష్ ప్రసంగాలు కానీ, ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలు కానీ, జనాలలోకి బలంగానే వెళుతున్నాయి.

 Nara Lokesh More Active On Politics-జగనే టార్గెట్ గా సరికొత్త రూట్లో లోకేష్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లోకేష్ పనితీరుపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.

చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కానీ, టీడీపీ 2024లో విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు లోకేష్ కు అన్ని అర్హతలు ఉన్నాయనే అభిప్రాయము పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.ఎలా చూసుకున్నా లోకేష్ తన గ్రాఫ్ పెంచుకోవడం సక్సెస్ అయ్యారు.2019 ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన సమయంలో కానీ, ప్రసంగాలలో గాని, పార్టీ పరంగా యాక్టివ్ గా ఉండటంలో కానీ, ఎలా చూసుకున్నా, లోకేష్ పనితీరు అంతంతమాత్రంగానే ఉండడమే కాకుండా, పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలకు గురి చేశాయి.ఇప్పుడు చూస్తే వరుసగా ప్రభుత్వ పథకాలు, జగన్ నిర్ణయాలపైన అదేపనిగా లోకేష్ విమర్శలు చేస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా బహిరంగంగానే లోకేష్ దూకుడు పెంచారు.ఇది వర్కవుట్ అవుతుండటం తో లోకేష్ కు అవసరమైన మరింత పొలిటికల్ నాలెడ్జ్ అందించేందుకు పార్టీ సీనియర్ నేతల బృందం ఒకటి గట్టిగానే కసరత్తు చేస్తోందట.ఆ సీనియర్ నేతలు తయారు చేసే స్క్రిప్ట్ ప్రకారం లోకేష్ రాజకీయంగా అడుగులు వేస్తే ఆయన ఆదరణ మరింత పెరుగుతుంది అనే ధీమా పార్టీలో నెలకొంది.ఇక దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు తదితర సీనియర్ నేతలు ఎంత ఇప్పుడు లోకేష్ కు అవసరమైన పొలిటికల్ నాలెడ్జ్ ను అందించి, రకాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేస్తుండడంతో లోకేష్ గ్రాఫ్ ముందు ముందు మరింత పెరిగేలా కనిపిస్తోంది.

#Cm Seat #Nara #Jagan #Lokesh #Devineni Uma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు