ఆ బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న నారా లోకేష్!

నారా లోకేష్ ఏంటి సినిమాలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నా. నారా లోకేష్ అంటే మనకు ఏం అని తెలుసు? నారా చంద్రబాబు నాయుడు కొడుకు అని తెలుసు.ఫారిన్ లో చదివాడు అని తెలుసు.నారా బ్రహ్మీని భర్త అని.బాలయ్య బాబు అల్లుడు అని.తెలుగు రాని మంత్రని మాత్రమే మనకు ఇన్నాళ్లు తెలుసు.
కానీ ఇటీవల కాలంలో వినిపిస్తున్న వార్తల ప్రకారం నారా లోకేష్ లో మరో కొత్త కోణం ఉంది.కేవలం బిజినెస్, రాజకీయాలు మాత్రమే కాదు ఆయనలో మరో కోణం కూడా ఉంది.

 Nara Lokesh Missed Chance In Teja Movie, Nara Lokesh, Jayam, Director Teja, Chan-TeluguStop.com

ఆయనకు సినిమాలలో నటించాలి అనే కోరిక ఉండేదట.అతను కూడా హీరో అవ్వాలని అనుకున్నారట.

ఇక అప్పట్లో తేజ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడని కూడా వార్తలు తీవ్ర స్థాయిలో వచ్చాయ్.

చంద్రబాబు కుటుంబం నుంచి ఒకరిని హీరోగా తీసుకురావాలని అప్పట్లో భారీ ప్రయత్నాలు జరిగాయట.

నారా లోకేష్ కి సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉండటంతో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో 2002 సంవత్సరంలోనే పూజ కార్యక్రమాలు కూడా జరిగాయట.కానీ ఆతర్వాత ఏమైందో తెలియదు సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

ఆతర్వాత నారా లోకేష్ ఇండియా నుంచి చదువు కోసం ఫారిన్ వెళ్ళిపోయాడు.అతను వెళ్ళిపోయాక చేసేది ఏమి లేక తేజ తన సినిమాను నితిన్, సదాలతో సినిమా తీశాడు.

సూపర్ హిట్ అయ్యింది.అదే జయం.

ఇక నారా లోకేష్ చదువు పూర్తి చేసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నారు.ఆతర్వాత రాజకీయ రంగప్రవేశం చెయ్యడం, పంచాయితీ రాజ్, ఐటీ శాఖలకు మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇటీవల జరిగిన 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చెయ్యగా అక్కడ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube