సీఎం జగన్ పై సీరియస్ కామెంట్స్ చేసిన నారా లోకేష్..!!

టీడీపీ నేత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీరియస్ కామెంట్ చేశారు.స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిదగ్గర ప్రాంతంలో ఆడపిల్లలపై అత్యాచారం జరిగినా సరైన స్పందన లేదు అన్న తరహాలో ఇటీవల సీతానగరం పుష్కర ఘాట్ వద్ద జరిగిన అత్యాచారం పై నారా లోకేష్ స్పందించారు.

 Nara Lokesh Made Serious Comments On Cm Jagan-TeluguStop.com

రాష్ట్రంలో ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న గాని.ప్రభుత్వంలో స్పందన లేదని మండిపడ్డారు.’జనం తిరగబడతారనే భయంతో రెండేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ లో హోం ఐసోలేషన్ అయిన సీఎం జగన్ రెడ్డి గారూ.మీ ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారనే సమాచారమైనా మీకు తెలుసా?’ అని లోకేశ్ ట్విటర్ లో ప్ర‌శ్నించారు.

‘రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమయ్యారు? సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న.ఆడపిల్లకి అన్యాయం జరిగితే జగన్ కంటే ముందొస్తాడు జగన్ అంటూ ఆయన పై వ్యంగ్యంగా సటైర్లు వేశారు.

 Nara Lokesh Made Serious Comments On Cm Jagan-సీఎం జగన్ పై సీరియస్ కామెంట్స్ చేసిన నారా లోకేష్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Ap Women Protection, Jagan, Jagan Under Police Protection, Lokesh, Lokesh Comments Jagan, Pushkar Ghat, Rape, Sitanagaram, Social Media-Political

‘ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్? అమరావతి ఉద్యమానికి భయపడి వేలమంది పోలీసుల్ని కాపలా పెట్టుకున్న పిరికి పంద జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థ‌కమైంది’ అని లోకేశ్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.

#Sitanagaram #JaganUnder #Pushkar Ghat #Lokesh #ApWomen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు