చినబాబు ఓటమికి ఈ పెద్ద మిస్టేక్ కారణమా ?

సుధీర్గ రాజకీయ చరిత్ర, మొన్నటివరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అతి ఘోరంగా పరాజయం పొందింది.బాబు మినహా టీడీపీలో కీ రోల్ పోషించిన నాయకులు ఎవరూ గెలవకపోవడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 Nara Lokesh Lost In Ap Elections What Is The Reason-TeluguStop.com

ముఖ్యంగా తెలుగుదేశాన్ని ముందుండి నడిపించాల్సిన నాయకుడు, యువకుడు, చంద్రబాబు తనయుడైన లోకేష్ ఈ ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ కి పోటీ చేసి ఓటమి చెందడం నిజంగా పెద్ద షాకే.ఎందుకంటే లోకేష్ పార్టీలో ఆషామాషీ వ్యక్తేమీ కాదు.

బాబు తరువాత పార్టీని లీడ్ చేసే నాయకుడు.

లోకేష్ ఎందుకు ఓటమిపాలయ్యాడు అనే ప్రశ్నకు కారణాలు ఏవీ స్పష్టంగా కనిపించడంలేదు.

ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆతృత తప్ప తాను పోటీ చేసే నియోజకవర్గం సురక్షితమా కాదా అనే విషయాన్నిమాత్రం పెద్దగా పరిగణలోకి తీసుకోలేనట్టు కనిపిస్తున్నాడు.మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ కు చాలా ప్రతికూలతలే ఎదురయ్యాయి.

మంగళగిరి నియోజకవర్గంలో ముందు నుంచి బీసీలు మాత్రమే గెలుస్తూ వస్తున్నారు.ఎందుకంటే ఇక్కడ పద్మశాలి సామజీక వర్గం ఎక్కువ.

దీనితో ఇక్కడ ప్రతి ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ అదే సామాజికవర్గానికి చెందిన అభ్యర్దులను దించుతూ ఉంటాయి.

చినబాబు ఓటమికి ఈ పెద్ద మిస్టే

కానీ 2014 ఎన్నికల్లో మాత్రం ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ని బరిలోకి దించింది వైసీపీ.ఇక అదే ఎన్నికల్లో ఓటమి పాలు అయిన టిడిపి అభ్యర్ధి గంజి చిరంజీవి కూడా పద్మశాలి అభ్యర్ది కావడం విశేషం.అయన పై ఆళ్ళ రామకృష్ణ రెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు .దీనితో ఈ ఎన్నికల్లో పద్మశాలి అభ్యర్దికే టికెట్ ఇస్తారని అంతా భావించగా అనూహ్యంగా లోకేష్ పోటీకి దిగారు.అయితే ఈ ఎన్నికల్లో ఎమ్యెల్యేగా బరిలోకి దిగుదామని ఆరాటపడిన లోకేష్ టిడిపికి కంచుకోట అయిన హిందూపురం , కుప్పం వంటి నియోజకవర్గాలని ఎంచుకోకుండా ఇలా రిస్క్ చేశారు.

ఫలితంగా వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.ఇది ఇప్పుడు ఇక్కడితో ఆగదు.ఆ ప్రభావం కాస్తా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై తప్పనిసరిగా పడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube