లోకేష్ శభాష్ అంటున్నారే ? కరోనాను ఇలా వాడేశాడనేగా ?  

Nara Lokesh Lost 20kilos Lockdown - Telugu Chandrababu, Coronavirus, Lockdown, Lost 20kilos, Nara Lokesh, Nara Lokesh Weight, Tdp

ఎటువంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోవాలంటే, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థులకు ఒక ఆటబొమ్మగా కనిపిస్తూ ఉంటారు.ఆయనపై రకరకాలుగా వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఆయనపై బాడీ షేమింగ్ కు పాల్పడుతుంటారు.

 Nara Lokesh Lost 20kilos Lockdown

ఆయన లావుగా ఉన్న విషయాన్ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ అభాసుపాలు చేస్తూ ఉంటారు.లోకేష్ ను రాజకీయంగా తన తరువాతి స్థానంలో కూర్చోబెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే , ఆయన ప్రజల్లో ఈ విధంగా అభాసుపాలవుతుండడం చంద్రబాబు కు సైతం మింగుడు పడని అంశంగా మారింది.

కానీ ఇప్పుడు లోకేష్ చేసిన కష్టానికి అందరూ ఫిదా అవుతున్నారు.ఇకపై ఆయనకు బాడీ షేమింగ్ విమర్శలు నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఏర్పడింది.

లోకేష్ శభాష్ అంటున్నారే కరోనాను ఇలా వాడేశాడనేగా -Political-Telugu Tollywood Photo Image

దీనికి కూడా సోషల్ మీడియానే కారణం అవ్వడం విశేషం.

కరోనా కారణంగా విధించిన అకస్మాత్తు లాక్ డౌన్ కారణంగా చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితం అయిపోయారు.

దీంతో ఇప్పటికే లావుగా ఉన్న లోకేష్ మరింత లావు అవుతారని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు మొదలు పెట్టడంతో, దీనిని సీరియస్ గా తీసుకున్న లోకేష్ ఫిట్నెస్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి దాదాపు 20 కేజీలకు పైగా ఈ రెండు నెలల కాలంలో తగ్గడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.మహానాడు ఏర్పాట్లు దగ్గర ఉండి చూస్తున్న లోకేష్ ను కలిసిన పలువురు పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులు లోకేష్ ను చూసి అసలు ఇంత తక్కువ సమయంలో ఇంత స్లిమ్ గా ఎలా అయ్యారు అంటూ ఆసక్తిగా అడిగి తెలుసుకుంటున్నారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు కొందరు మీరు ఎప్పుడూ ఇలాగే స్లిమ్ గా ఉండాలంటూ లోకేష్ తో ముచ్చటిస్తూ మెచ్చుకుంటున్నారు.ఈ రెండు నెలల కాలంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన లోకేష్ ఇతర విషయాలన్నిటినీ పక్కనపెట్టి పూర్తిగా ఫిట్నెస్ సాధించే విషయంపైనే దృష్టి పెట్టడం, తనపై వచ్చే అనవసర వ్యంగ్య విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పడంతో ఇప్పుడు అందరు లోకేష్ ను మెచ్చుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nara Lokesh Lost 20kilos Lockdown Related Telugu News,Photos/Pics,Images..