మంగళగిరిలో లోకేష్ ఓటమి! మొదటి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ  

మంగళగిరిలో ఓడిపోయినా నారా లోకేష్. .

Nara Lokesh Lose In Mangalagiri-mangalagiri,nara Lokesh Lose,tdp,ys Jagan,ysrcp

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఈ ఎన్నికలలో గెలిచి తన మీద ఉన్న పప్పు ముద్రని అలాగే, ఎన్నికలలో గెలవకుండా అడ్డదారిలో మంత్రి అయ్యాననే అపవాదుని దూరం చేసుకోవాలని ప్రయత్నం చేసాడు. దాని కోసం మంగళగిరి నియోజక వర్గాన్ని ఎంచుకొని ఎన్నికలలో పోటీ చేసాడు. ఇక ఆ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణ రెడ్డి మీద పోటీకి దిగాడు..

మంగళగిరిలో లోకేష్ ఓటమి! మొదటి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ-Nara Lokesh Lose In Mangalagiri

ఇక రాజధానిని అభివృద్ధి చేసిన మంగళగిరిని రాజధాని ప్రాంతంగా చేసిన టీడీపీ పార్టీ మీద స్థానికల ప్రజలలో అభిమానం ఉంటుందని, అది తనకి భాగా కలిసి వస్తుందని భావించి అక్కడ బరిలో నిలబడ్డాడు.

అయితే ఏపీలో వైసీపీ సునామీలో నారా లోకేష్ కూడా కొట్టుకుపోయాడని చెప్పాలి. ఏపీ మొత్తంగా కేవలం 24 స్థానాలకే పరిమితం అయిన టీడీపీ నుంచి చాలా మంత్రులు ఓడిపోయారు. ఇక వారిలో నారా లోకేష్ కూడా చేరిపోయారు.

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, నారా లోకేష్ మధ్య మంగళగిరిలో చివరి రౌండ్ వరకు పోటా పోటీ నడిచింది. అయితే మొదటి నుంచి ఆధిక్యం ప్రదర్శిస్తూ వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి చివరి రౌండ్ లో కూడా ప్రభావం చూపించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో నారా లోకేష్ కి ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక కోరికగానే ఇప్పుడు మిగిలిపోయింది.

తండ్రి తర్వాత పార్టీకి పెద్ద దిక్కుగా మారాలని అనుకున్న లోకేష్ కి ఓ విధంగా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి.