చినబాబూ ! 'అంతకు మించి' కావాలి బాబు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని బాగా యాక్టివ్ అయ్యాయి.వరుస వరుసగా ప్రభుత్వ పాలనలో ఏర్పడిన లోపాలన్నిటిని ఎట్టి చూపుతున్నారు.

అంతేకాదు ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను కూడా లోకేష్ జత చేస్తూ దూకుడుగా ఉన్నాడు.ఈ పరిణామాలన్నీ టీడీపీలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

అంతే కాదు కింది స్థాయి నాయకులూ వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు.అయితే కేవలం లోకేష్ ట్విట్లు చేయడం వరకు పరిమితం అయిపోతే క్షేత్ర స్థాయిలో పట్టు పెంచుకోవడం ఎలా సాధ్యం అవుతుంది అనే ప్రశ్న తలెత్తుతోంది.

చంద్రబాబు తరువాత పార్టీ బరువు బాధ్యతలు మోయాల్సిన చినబాబు లోకేష్ కేవలం అమరావతికి, ఆఫీసుకి పరిమితం అయిపోతే ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది.

-Telugu Political News

లోకేష్ తెలివితేటల విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు అవసరం లేదు.ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం నగదు బదిలీ పథకాలతో జనాల్లోకి దూసుకెళ్తోంది.కానీ తెలుగు రాజకీయాల్లో మొదట నగదు బదిలీ అనే ఆలోచన చేసిందే నారా లోకేష్.ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వక ముందు చదువు పూర్తి చేసిన తర్వాత తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నప్పుడు.2009లో మొదటిసారిగా.టీడీపీ మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకాన్ని లోకేష్పె సూచనలతో చేర్చారు.కానీ అది జనాల్లోకి పెద్దగా వెళ్ళలేదు.కానీ ఇప్పుడా నగదు బదిలీ పథకాలే కీలకం అయ్యాయి.ఆ తర్వాత నారా లోకేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆయన సమర్థుడైన రాజకీయ నాయకుడిగా సక్సెస్ కాలేకపోయారు.

ఆయన వ్యక్తిగత లోపాలు ఎత్తి చూపుతూ ప్రత్యర్థి పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టడంతో జనాల్లో కూడా అదే ముద్ర పడిపోయింది.

-Telugu Political News

ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి బయటకి వచ్చి ప్రజాక్షేత్రంలో బలం పెంచుకోవాలంటే లోకేష్ తనను తాను నిరూపించుకోవాలి.అలా చేయాలంటే కేవలం ట్విట్లనే నమ్ముకోకుండా ప్రజల్లో తిరిగి వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలి.కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేలా ప్రసంగాలు చేయాలి.

ఇలా చేస్తేనే లోకేష్ కు రాజకీయ భవిష్యత్ ఉంటుంది.ఈ విషయంలో లోకేష్ పాజిటివ్‌ ధోరణిలోనే ఉన్నారని ఆయన ప్రకటనలు చూస్తే తెలుస్తోంది.

తాను ప్రజల్లోనే ఉంటానని గెలుపోటములకు ప్రాధాన్యత లేదని అంటున్నారు.కానీ వాస్తవంలోకి వచ్చే సరికి ఆయనకు తీరికలేనట్టుగా కేవలం ఆఫీస్ కి పరిమితం అయిపోతున్నారు.

ఈ ఐదేళ్లల్లో పార్టీ బలోపేతం చేయడం, వలసల నిరోధనైకి చర్యలు తీసుకోవడం, ప్రభుత్వ లోపాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ప్రజాక్షేత్రం లో పోరాటం చేయడం ఇవన్నీ చేస్తేనే లోకేష్ పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా అవతరిస్తాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube