మంగ‌ళ‌గిరికి లోకేష్ గుడ్‌బై...? తెర‌పైకి మ‌రో నియోజ‌క‌వ‌ర్గం!

నారా లోకేష్ ఎప్పుడైతే మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేశారో అప్ప‌టి నుంచే ఆయ‌న‌కు పెద్ద‌గా క‌లిసిరావ‌ట్లేద‌నే చెప్పాలి.ఎందుకంటే ఎన్నో స‌ర్వేలు నిర్వ‌హించిన చివ‌ర‌కు రాంగ్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న సెల‌క్ట్ చేసుకున్నారు.

 Nara Lokesh Goodbye To Mangalagiri Another Constituency On The Screen-TeluguStop.com

ఇక తొలిసారి పోటీ చేసిన ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఆయ‌న ఓడిపోవ‌డం టీడీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పుడు చంద్ర‌బాబు త‌ర్వాత పార్టీని న‌డిపించాల్సిన యువ నాయ‌కుడిగా ఆయ‌నే ఓట‌మి పాలుకావ‌డం కార్య‌క‌ర్త‌ల దైర్యాన్ని దెబ్బ‌తీసింది.

దీంతో ఈ సారి ఎలాగైనా పోటీ చేసి గెల‌వాల‌ని ఆయ‌న పక్కాగా వ్యూహాలు రచిస్తున్నారు.ఇందులో భాగంగా ఏ నియోజ‌క‌వ‌ర్గం అయితే త‌న‌కు క‌లిసివ‌స్తుందో, ఎందులో అయితే తాను గెలుస్తానో అంటూ సీక్రెట్‌గా స‌ర్వేలు కూడా చేసుకుంటున్నారు.

 Nara Lokesh Goodbye To Mangalagiri Another Constituency On The Screen-మంగ‌ళ‌గిరికి లోకేష్ గుడ్‌బై… తెర‌పైకి మ‌రో నియోజ‌క‌వ‌ర్గం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్ర‌మంలో ఆయ‌న మంగ‌ళ‌గిరికి కూడా చాలా త‌క్కువ‌గానే వెళ్తున్నారు.ఇక కొత్త‌గా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌పై స‌ర్వే చేయించిన టీడీపీ అధిష్టానం చివ‌ర‌కు ఓ నియోజ‌క‌వ‌ర్గం మీద ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

అదే విశాఖ‌ప‌ట్నంలోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం.ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో లోకేష్ పోటీచేయాల‌ని చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

కానీ దీని నుంచి అప్ప‌టి గంటా శ్రీనివాస‌రావు పోటీ చేయాల‌ని చూడ‌టంతో లోకేష్ మంగ‌ళ‌గిరిని ఎంచుకున్నారు.

Telugu Bheemili Constituency, Chandra Babu, Chandrababu Naidu Son Nara Lokesh, Ghanta Srinivasa Rao, Lokesh Changing Constituency, Mangalagiri Constituency, Nara Lokesh, Tdp, Vishakapatnam, Ycp Minister Avanthi Srinivasa Rao-Telugu Political News

కానీ చివ‌ర‌కు గంటా శ్రీనివాస‌రావు కూడా పోటీచేయ‌లేదు.స‌బ్బంహ‌రిని లాస్ట్ మినిట్‌లో పోటీకి దించారు.కానీ ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

ఆయ‌న ఇక్క‌డ బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు.అలాంటి వ్య‌క్తిని ఢీకొట్ట‌డం లోకేష్‌కు క‌త్తిమీద సాములాంటిదే అని చెప్పాలి.

మ‌రి లోకేష్ ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారా లేక వేరే నియోజ‌క‌వ‌ర్గానికి షిఫ్ట్ అవుతారా అన్న‌ది చూడాలి.కానీ లోకేష్‌కు చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గం కూడా పెద్ద సవాల్ అయిపోయింద‌ని వైసీపీ కామెంట్లు చేస్తోంది.

#Vishakapatnam #GhantaSrinivasa #Nara Lokesh #Chandra Babu #YcpMinister

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు