లోకేష్ వెన్నుపోటు పొడిచాడా ...పవన్ కోపానికి కారణం ఏంటి...  

Nara Lokesh Give Surprise To Janasena Pawan Kalyan-

పోరాట యాత్రలతో దూసుకుపోతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన మాటల తూటాలకు మరింత పదును పెట్టాడు.తన సభలకు భారీ స్థాయిలో జనం వస్తుండడంతో పవన్ లో ఒక రకమైన ధీమా పెరిగినట్టు కనిపిస్తోంది.

Nara Lokesh Give Surprise To Janasena Pawan Kalyan--Nara Lokesh Give Surprise To Janasena Pawan Kalyan-

అందుకే తన మాటలకు మరింత పదును పెడితే తమ పార్టీ ఇమేజ్ అమాంతం పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నాడు.ముఖ్యంగా ఎప్పుడూ లేనంత స్థాయిలో చంద్రబాబు తనయుడు లోకేష్ ని టార్గెట్ చేసుకున్నాడు.

పవన్ యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతోంది.

నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో లోకేష్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.లోకేష్ తన తండ్రిని కాకుండా.మహ్మాత్ముల్ని ఆదర్శంగా తీసుకోవాలని పవన్ సూచించారు.స్టాన్‌ఫర్డ్‌లో చదువుకున్న లోకేష్.యూనివర్సిటీలో చదువుతున్న కెనడీ చెప్పిన మాటలు ” దేశం నాకేమి ఇచ్చిందని కాదు.దేశానికి నేను ఏమి ఇచ్చాను” ఆచరించాలని సూచించారు.కానీ లోకేష్ మాత్రం దేశం నుంచి ఎంత దోచుకుందామా అని చూస్తున్నారన్నారాణి పవన్ విమర్శించారు.

గతంలో శ్రీరెడ్డి అనే నటీమణి వివాదం విషయంలో.లోకేష్ హస్తం ఉందని.పవన్ కల్యాణ్ ఆరోపించారు.అదే అంశాన్ని నిడదవోలులోనూ.ప్రస్తావించారు.

లోకేష్.ఎదురుగా కౌగిలించుకొని వెనుక నుంచి పొడిచే రకమని కానీ అలా పొడిపించుకోవడానికి ఎవరూ ఇక్కడ సిద్ధంగా లేరని మండిపడ్డారు.

లోకేష్ కూడా నన్ను తిట్టిస్తున్నారు.నా తల్లిని అనకూడని మాటలు అనిపించారని ఆవేదన వ్యక్తం చేసాడు.లోకేష్ గారు.ఒక్కసారి మీ అమ్మగారిని అడగండి.నేను ఇలా తిట్టించాను.తప్పా.ఒప్పా అని అడగండి అన్నారు.జగన్‌ తనపై చేసిన వ్యక్తిగత విమర్శలపైనా పవన్ స్పందించారు.ప్రజాసమస్యలపై స్పందిస్తూంటే.జగన్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారని.తన జీవితంలో రహస్యాలు లేవని పవన్ స్పష్టం చేశారు.తాడేపల్లి గూడెం సభలోనూ.లోకేష్‌ను పవన్ కల్యాణ్ టార్గెట్ చేసుకునే ఎక్కువ మాట్లాడారు.