'తండ్రీ , కొడుకు' లకు ఓ సర్వే...?     2018-11-05   10:03:42  IST  Surya Krishna

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో జరగబోయే ఎన్నికలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఒక పక్క తెలంగాణ ఎన్నికల వ్యుహలని అమలు చేస్తూనే మరో పక్క ఏపీలో ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్ధులని ఖరారు చేయగా ఇప్పుడు తానూ పోటీ చేయబోయే స్థానం గురించి సర్వే చేయించుకుంటున్నారు..బాబుకి కుప్పం నియోజకవర్గం పెట్టిన కోట అయితే తనయుడు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో బాబు తన కుప్పం సీటుని కొడుక్కి అప్పగించాలని డిసైడ్ అయ్యారట.

Nara Lokesh From Kuppam And Chandrababu Naidu Tirupati-

Nara Lokesh From Kuppam And Chandrababu Naidu From Tirupati

అయితే ఇప్పుడు తాను ఎక్కడి నుంచీ పోటీ చేయాలి అనేది అతిపెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది..చంద్రబాబు చిత్తూరు జిల్లాలో ఎక్కడి నుంచీ పోటీ చేసినా గెలుపు సాధ్యమే..అయితే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి పోటీచేసే అంశంపై ఇంటిలిజెన్స్‌ వర్గాల ద్వారా ఇటీవలే సర్వే చేయించినట్లు తెలుస్తోంది..గత ఎన్నికల్లో చంద్రబాబు తిరుపతి వేదికగా జరిపిన భారీ సభలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం మట్టి తెచ్చి రాష్ట్ర రాజధాని అభివృద్దిలో మొండి చేయి చూపించిన మోడీకి తిరుపతి నుంచే పోటీ చేయడం ద్వారా బీజేపీ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు అనుకూలమైన అంశంగా మారుతుందని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బాబు ఆదేశాల మేరకు ఇంటిలిజెన్స్‌ వర్గాలు సర్వే చేపట్టి సీఎంకు నివేదిక అందించినట్లు తెలిసింది. కాగా సీఎం తాను పోటీచేసే స్థానంపై మరొక ఆలోచన కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మాణం పనులు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో కోస్తా ప్రాంతం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది..ఎందుకంటే రాజధాని పరిసర జిల్లాల్లో పోటీ చేయడంద్వారా వచ్చే ఎన్నికల్లో స్థానికంగా సెంటి మెంట్‌ రగిల్చి మరోసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం కల్పించాలని, తద్వారా ప్రపంచంలోని మేటి నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దే అవకాశాన్ని నాకు ఇవ్వమని బాబు ప్రజలని అడిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Nara Lokesh From Kuppam And Chandrababu Naidu Tirupati-

ఇదిలాఉంటే ఒకానొక దశలో అనంతపురం జిల్లాలో బాబు, లోకేషలలో ఎవరో ఒకరు బరిలోకి దిగేఅంశం కూడా పరిశీల నకు వచ్చినట్లు తెలిసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కియో కార్ల పరిశ్రమ ఈ జిల్లాలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ పోటీ చేయడంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది..అయితే లోకేష్ , చంద్రబాబు లు పోటీ చేస్తే స్థానాలపై వస్తున్నా ఊహాగానాలకి అతి త్వరలోనే చెక్ పడనున్నట్లుగా టీడీపీ సీనియర్ నేతలు చెప్తున్నారు.