లోకేష్ ఈ రేంజ్ లో రాజకీయం చేస్తే జగన్ సైతం వణకాల్సిందే

మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.చంద్రబాబు 70 ఏళ్ల వయసు దాటినా, ధైర్యంగా ఏపీలో అడుగు పెట్టి రాజకీయం చేస్తుంటే, లోకేష్ మాత్రం ఇంటికే పరిమితమై పోయారని, ఆయన రాజకీయంగా అసమర్థుడని, ఆయన చేతికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తెలుగుదేశం పార్టీ నిలువునా మునిగిపోతుందని, రాజకీయంగా లోకేష్ ఎప్పటికీ ఉన్నతస్థానానికి చేరుకోవడం కష్టం అంటూ పదేపదే వైసీపీ నాయకులతో పాటు, సొంత పార్టీ నాయకులు సైతం విమర్శలు చేస్తూ ఉండేవారు.

 Tdp Nara Lokesh  Visited Flood Affected Areas In East Godavari,tdp Leader Chandr-TeluguStop.com

అయితే లోకేష్ మాత్రం ఆ విమర్శలకు పెద్దగా స్పందించకుండా, సోషల్ మీడియా ద్వారా వైసీపీ పై విమర్శలు చేస్తూ, నిత్యం వార్తల్లో ఉండే వారు.

 ఇక ఆ సమయంలోనే రాజకీయంగానూ , అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించే విషయంపై అన్ని రకాలుగానూ తర్ఫీదు పొందినట్లు గా కనిపిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ లో అడుగు పెట్టిన లోకేష్ కరోనా భయాన్ని సైతం లెక్క చేయకుండా , నాయకులతో మమేకమవుతూ, జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం అమరావతిలో పర్యటించిన ఆయన ఆ ప్రాంత ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు,  వైసీపీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంటలు నీటమునిగి బాధలో ఉన్న రైతులను పరామర్శించారు.ఈ సందర్భంగా గా పొలాల్లోకి వెళ్లి రైతులు పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకున్నారు.

Telugu Amaravathi, Farmers, Heavy, Jagan, Kanna Babu, Lokesh, Tdpchandrabab, Ys

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.60 మందికిపైగా ఇక్కడ ఆత్మహత్య లు చేసుకున్నారని, వర్షాలు వరదల కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయారని, పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగిపోయాయి అని, అయినా వ్యవసాయ శాఖ మంత్రి ఈ జిల్లాలో ఉండి కూడా వారికి ఏం న్యాయం చేశారు అంటూ లోకేష్ మండిపడ్డారు.ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పైన లోకేష్ విమర్శలు చేశారు.ప్రస్తుతం లోకేష్ పర్యటనలతో తెలుగుదేశం పార్టీలో మంచి ఊపు వచ్చినట్లుగా కనిపిస్తోంది.లోకేష్ ఈ స్థాయిలో రాజకీయం చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మంచి ఉత్సాహం రావడం తో పాటు, వైసీపీ కి సైతం సమర్థుడైన రాజకీయ ప్రత్యర్థి గా లోకేష్ మారుతాడు అనడం లో ఏ సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube