ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్( TDP Nara Lokesh ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.151 సీట్లు గెలిచి జగన్ ఏం సాధించారో చెప్పాలన్నారు.ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్( YS Jagan ) ఓటమిని ఒప్పుకున్నట్లని పేర్కొన్నారు.సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి కొత్త బాండ్లు తీసుకొచ్చారని తెలిపారు.ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు, మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు.
వంద సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేశారన్న లోకేశ్ ఏపీలో వచ్చేది టీడీపీ – జనసేన ప్రభుత్వమేనని( TDP-Janasena ) ధీమా వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.ఒకవేళ ఉద్యోగాల కల్పన ఆలస్యం అయితే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని వెల్లడించారు.