ఇవి ప్రభుత్వ హత్యలే.. నారా లోకేష్ ఫైర్..!

కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలు ఆక్సిజన్ సరిపోక మృత్యువాత పడుతున్నారు.ఇప్పటికే చాలా చోట్ల ఆక్సిజన్ అందక మరణాలు సంభవిస్తున్నాయి లేటెస్ట్ గా తిరుపతి రుయా హాస్పిటల్ లో 11 మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచారు.

 Nara Lokesh Fires On Ap Government Ruia Hospital Corona Deaths, Ap Government, C-TeluguStop.com

ఈ ఘటనపై టీడీపీ నేత.పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు.తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన వార్త తనని దిగ్బ్రాంతికి గురి చేసిందని అన్నారు.ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని అన్నారు లోకేష్.

ఆక్సిజన్ అందక రోగులు మరణించడం చాలా బాధాకరమన్ణి అన్నారు లోకేష్.

రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అయిపోయేంత వరకు ప్రభుత్వం ఏం చేస్తుందని.

ఈ ఘటన ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతుందని విమర్శించారు.అంతేకాదు హాస్పిటల్ లో మిగతా రోగులు పడుతున్న ఇబ్బందికి సంబందించిన వీడియోని ట్విట్టర్ లో పెట్టారు లోకేష్.

మరో 13 మంది కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుందని.వారికైనా ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడాలని కోరారు.

ఏపీ ముఖ్యమంత్రికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని అసలు ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు నారా లోకేష్.రుయా హాస్పిటల్ లో మృతి చెందిన కరోనా రోగుల కుటుంబాలకు టీడీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రగాడ సానుభూతి తెలిపారు.

పరిపాలన చేతకాకపోతే జగన్ వెంటనే రిజైన్ చేయాలని ఆయన అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube