లోకేష్ ఇరుక్కున్నట్టేనా ? వారంలో నోటీసులు ?  

Nara Lokesh Fiber Grid Tdp Ysrcp - Telugu Ap, Cbi Rides, Chandrababu Naidu, Fiber Grid Issue, Nara Lokesh, Tdp Governament, Tdp Leaders, Vemmuri Hari Krishna, Ysrcp

ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిండా మునిగినట్టుగా కనిపిస్తున్నారు.ఇప్పటికే ఏపీ కేబినెట్ సబ్ కమిటీ విచారణ చేసి పూర్తి ఆధారాలను సీఎం జగన్ కు సమర్పించడంతో ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆధారాలు ఏపీ ప్రభుత్వం సంపాదించుకుంది.

 Nara Lokesh Fiber Grid Tdp Ysrcp

ముఖ్యంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేమూరు హరికృష్ణ కు భారీగా లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించారని, బ్లాక్ లిస్టులో ఉన్న అర్హతలేని కంపెనీకి టెండర్ కట్టబెట్టారని అభియోగాలు లోకేష్ పై నమోదు అవుతున్నాయట.టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న లోకేష్ ఫైబర్ గ్రిడ్ వ్యవహారాన్ని నడిపించారని, 2015 జూలై 7వ తేదీన 329 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ టెండర్లలో నాలుగు సంస్థలు బిడ్ దాఖలు చేశాయి.ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో ఈ పాస్ యంత్రాల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన టెరా సాప్ట్ ను 2015 మే 11వ తేదీన ఆంధ్రప్దేశ్ టెక్నాలజీ సర్వీసెస్ బ్లాక్లిస్టులో పెట్టింది.ఆ బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థకు టెండర్లలో బిడ్డ దాఖలు చేసేందుకు ఎటువంటి అర్హత ఉండదు.కానీ ఈవిఎం మిషన్ ల చోరీ కేసులో నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ కు చెందిన టెరా సాఫ్ట్ బిడ్ ను ఆమోదించాలని అప్పటి టీడీపీ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారని, సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది.

లోకేష్ ఇరుక్కున్నట్టేనా వారంలో నోటీసులు -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అలాగే తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన ఎల్ 1 అనే సంస్థను కాదని ఎక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన టెరా సాఫ్ట్ కు ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్ దక్కేలా లోకేష్ చక్రం తిప్పారని సబ్ కమిటీ విచారణలో తేలింది.

ఈ వ్యవహారంలో 200 కోట్లకు పైగా అవినీతి చోటు చేసుకున్నట్లుగా క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ధారణ చేసింది.

ఈ స్కాం లో నారా లోకేష్ పాత్ర ఎక్కువగా ఉందనే ఆధారాలు వైసీపీ ప్రభుత్వం సంపాదించింది.ఈ మేరకు మరో వారం రోజుల్లో లోకేష్ కు నోటీసు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.

ఇప్పటికే టీడీపీ నాయకులపై వరుస వరుసగా కేసులు నమోదు అవుతుండడం, కీలక నాయకులంతా జైలు బాట పట్టించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడం వంటి పరిణామాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nara Lokesh Fiber Grid Tdp Ysrcp Related Telugu News,Photos/Pics,Images..

footer-test