లోకేషే దిగివ‌చ్చినా.. ఆ టీడీపీ కీల‌క నేత‌ అడ్ర‌స్ క‌నిపించ‌లేదే..!

పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నా.ఎంతగా స‌మ‌స్య‌లు ఉన్నా.

 Nara Lokesh Angry On Payyavula Keshav, Nara Lokesh, Chandra Babu Naidu, Tdp, Dis-TeluguStop.com

కీల‌క నేత‌లు జిల్లాకు వ‌చ్చారంటే.నేత‌లంగా ముందుంటారు.

స‌ద‌రు నేత పాల్గొనే కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేస్తారు.ఆ త‌ర్వాత త‌మ స‌మ‌స్య‌ల‌ను స‌ద‌రు నేత‌కు చెప్ప‌కొని ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేస్తారు.

కానీ, అనంత‌పురం జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, టీడీపీలో సుదీర్ఘ కాలం నుంచి ఉన్న సీనియ‌ర్ నేత‌.ప‌య్యావుల కేశ‌వ్ మాత్రం ఈ సూత్రాన్ని ఎక్క‌డా పాటిస్తున్న జాడ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కార‌ణాలు ఏమైనా.పార్టీకి దూరంగా ఉన్నారు ప‌య్యావుల కేశ‌వ్‌.పార్టీలోనే ఉన్న‌ప్ప‌టికీ.ఆయ‌న పార్టీ త‌ర‌ఫున ఏ కార్య‌క్ర‌మంలోనూ పాల్గొన‌డం లేదు.

అత్యంత కీల‌క‌మైన పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చినా ఆయ‌న అసంతృప్తితోనే ఉన్నారు.ఆయ‌న బంధుగ‌ణానికి ప్రాధాన్యం ల‌భించ‌డం లేద‌నో.

లేక మ‌రే కార‌ణ‌మో తెలియ‌దు కానీ.ఆయ‌న పార్టీ అధినేత చంద్ర‌బాబు పిలుపు ఇచ్చిన కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు.
లేదా.చంద్ర‌బాబును చూసి అమ‌రావ‌తిలో భూముల కొనుగోలు చేశాం.ఇప్పుడు అవి వివాదంలో చిక్కుకున్నాయ‌ని ఆవేద‌నో తెలియ‌దు.స‌రే! ఎన్ని వివాదాలు ఉన్న‌ప్ప‌టికీ.

పార్టీలో ఆయ‌న కీల‌క పొజిష‌న్‌లో ఉన్నారు.సో.పార్టీ త‌ర‌పున కీల‌క‌మైన నాయ‌కుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్న బాబు కుమారుడు లోకేష్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ప‌టికీ.ప‌య్యావుల గ‌డ‌ప దాట‌లేదు.

నిజానికి ఆయ‌న అస‌లు జిల్లాలోనే లేర‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

కానీ, ఎక్క‌డున్నా.

లోకేష్ హాజ‌రైన కార్య‌క్ర‌మానికి చాలా మంది నాయ‌కులు వ‌చ్చారు.లోకేష్ కు మ‌ద్ద‌తుగా నిలిచారు.

కానీ, ప‌య్యావుల మాత్రం రాలేదు.ఆయ‌న వ‌చ్చి .కార్య‌క్ర‌మానికి హ‌జ‌రై.అంతా అయిపోయిన త‌ర్వాత‌.

త‌న స‌మ‌స్య‌ను చెప్పుకొని ఉంటే ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉండేద‌ని అంటున్నారు.కానీ, ఆయ‌న సైలెంట్ అవ‌డం వెనుక మ‌రేదైనా రీజ‌న్ ఉందేమో.

అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube