ఏంటి లోకేష్ ధీమా ? అధికారంలోకి వచ్చేస్తున్నారా ?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనపై ఉన్న ముద్రను పూర్తిగా తొలగించుకునే పనిలో ఉన్నారు.పదే పదే తనపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ , తాను రాజకీయ అసమర్డుడుని అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న వైసీపీ కి గట్టి చెక్ పెట్టేందుకు లోకేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

 Political Leaders On Nara Lokesh Political Activites , Nara Lokesh, Chandrababu,-TeluguStop.com

రాజకీయంగా తాను ఎంత బలవంతుడినో నిరూపించుకునేందుకు లోకేష్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.కేవలం సోషల్ మీడియా కి పరిమితం అయిపోవడం ద్వారా,  రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించిన లోకేష్  అవకాశం దొరికినప్పుడల్లా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ,  పార్టీ నాయకుల్లో తన నాయకత్వంపై నమ్మకం కలిగించే విధంగా వ్యవహారాలు చేస్తున్నారు.

తాజాగా విశాఖలో మత్తు డాక్టర్ సుధాకర్ మరణించడంతో  ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు లోకేష్ అక్కడకు వెళ్లారు.ఆ సందర్భంగా రాజకీయ విమర్శలు చేశారు.
కరోనా సమయంలో ఏపీలో ఉండకుండా , చంద్రబాబు ఆయన కుమారుడు పక్క రాష్ట్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టే విధంగా లోకేష్ హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చినట్లుగా కనిపిస్తున్నారు.  రాబోయేది వైసిపి ప్రభుత్వమేనని లోకేష్ చాల ధీమాగా చెబుతుండడం ఆసక్తికరంగా మారింది.

పార్టీ పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగానే ఉంది.వరుసగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ ఓటమి ఎదురయింది.

ఎంతో మంది టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోయారు.మరెంతోమంది సైలెంట్ అయిపోయారు.

చాలా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.ధైర్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు నియోజకవర్గాల్లో నేతలు కనిపించని పరిస్థితి ఉంది.

లోకేష్  తామే అధికారంలోకి వస్తున్నాం అని పదే పదే చెప్పడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి.ఆ తరహా వ్యాఖ్యలు చేయడం ద్వారా నిరాశ నిస్పృహల్లో ఉన్న పార్టీ కేడర్ లో ఉత్సాహం తీసుకు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని,  అలాగే వైసిపి విషయంలో తాము ఏమి భయపడడం లేదని లోకేష్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu Chandrababu, Jagan, Lokesh, Tdp, Telugudesam, Vizag Sudhakar, Ycp, Ysrcp-

 పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లోనూ తన రాజకీయ అడుగుల పై ఎటువంటి సందేహాలు లేకుండా,  చంద్రబాబు స్థాయి వ్యక్తి ని అని నిరూపించుకునేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఇప్పటికే హైదరాబాద్ లోని తన నివాసం ఉంటున్న లోకేష్ సభలు,  సమావేశాల్లో ఏవిధంగా మాట్లాడాలి రాజకీయ కామెంట్లు చేసే సమయంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి ? ఏవిధంగా మాట్లాడితే జనాల్లోకి వెళ్ళుతుంది అనేక అంశాలపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.పదే పదే తాము అధికారంలోకి వస్తున్నాం అనే వ్యాఖ్యలు చేయడం ద్వారా , పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం రేకెత్తించేందుకు ప్రయత్నాలుగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube