అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా?  

Nara Lokesh Comments On Jagan Mohan Reddy-chalo Atamakur,jagan Mohan Reddy,nara Lokesh

తెలుగు దేశం పార్టీ తలపెట్టిన ఛలో ఆత్మకూరును పోలీసులు భగ్నం చేసిన విషయం తెల్సిందే.ఆత్మకూరు వెళ్లాలనుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు.ఇంట్లోంచి బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు...

Nara Lokesh Comments On Jagan Mohan Reddy-chalo Atamakur,jagan Mohan Reddy,nara Lokesh-Nara Lokesh Comments On Jagan Mohan Reddy-Chalo Atamakur Jagan Reddy

దాంతో నారా లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.ఇదే సమయంలో కొందరు నెటిజన్స్‌ చంద్రబాబు నాయుడుపై పొలిటికల్‌ టెర్రరిస్టు అంటూ మీమ్స్‌ క్రియేట్‌ చేశాడు.బిన్‌లాడెన్‌ ఇంకా ఉగ్రవాదుల ఫొటోలతో చంద్రబాబు నాయుడు ఫేస్‌ మార్ఫింగ్‌ చేసి ఈ పని చేశారు.

మార్ఫింగ్‌ ఫొటోలపై నారా లోకేష్‌ చాలా సీరియస్‌ అన్నాడు.ఈ విషయమై జగన్‌ను లోకేష్‌ ప్రశ్నిస్తూ.జగన్‌ గారు, అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా, లేనట్టా? మీ గుడ్డి సర్కార్‌కు ఈ మార్ఫింగ్‌ పోస్టులు కనిపించడం లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి ఇలాంటివి పోస్ట్‌ చేయడం ఎంత వరకు కరెక్ట్‌.ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకునేందుకు మీకు చేతులు రావా.చట్టాలు అనేవి లేవా? మీ చట్టాలన్నీ కూడా తెలుగు దేశం పార్టీ నాయకులపై పెట్టడానికేనా అంటూ లోకేష్‌ ఫైర్‌ అయ్యాడు.

Nara Lokesh Comments On Jagan Mohan Reddy-chalo Atamakur,jagan Mohan Reddy,nara Lokesh-Nara Lokesh Comments On Jagan Mohan Reddy-Chalo Atamakur Jagan Reddy