లోకేష్ ట్విట్టర్ పక్షేనా ? జనంలోకి రానివ్వరా ?  

Nara Lokesh Comments On Ysrcp In His Tweets-cm Chandrababu,nara Lokesh,tdp,twitter Comments,ysrcp Govt,లోకేష్ ట్విట్టర్

తెలుగుదేశం పార్టీ ఓటమిచెంది ప్రతిపక్షానికే పరిమితం అయిన దగ్గర నుంచి పార్టీలో నాయకులు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. వైసీపీ మీద ఆరోపణలు చేయడానికి కూడా నేతలు జంకుతున్నారు. అయితే ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ మాత్రం వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు..

లోకేష్ ట్విట్టర్ పక్షేనా ? జనంలోకి రానివ్వరా ? -Nara Lokesh Comments On Ysrcp In His Tweets

ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద వైసీపీ ని గట్టిగా టార్గెట్ చేస్తున్నాడు. అయితే అయన మాత్రం ఎక్కడా మీడియా ముందుకి రావటం లేదు. చంద్రబాబు అయినా గత వారం పది రోజుల నుండి ప్రజల మధ్యకి వస్తున్నాడు.

కానీ లోకేష్ బయటకు వచ్చే దైర్యం చేయలేకపోతున్నాడు. లోకేష్ కు జనం మధ్యకు రావాలని బలంగా ఉన్నా చంద్రబాబు నాయుడు వద్దని చెప్పి ట్విట్టర్ కే పరిమితం చేసినట్టు తెలుస్తోంది. లోకేష్ జనం మధ్యకు వస్తే ఏమి జరుగుతుందో ముందే గ్రహించిన బాబు ఈ విధంగా కట్టడి చేసినట్టు అర్ధం అవుతోంది.

ప్రస్తుతం లోకేష్ కొనసాగిస్తున్న ట్విట్టర్ వార్ ను కొంతమంది పార్టీ నేతలు తెగ పొగిడేస్తున్నారు. కాబోయే టీడీపీ అధినేత గా కొందరు లోకేష్ ని పొగిడేస్తున్నారు చంద్రబాబు మనస్సులో కూడా అదే ఉంది. లోకేష్ ప్రస్తుతం ట్విట్టర్ ద్వారా రోజుకో ఒక విమర్శ చేస్తున్నారు.

అది నిజమో కాదో అనే విషయాన్నీ పక్కన పెడితే ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శిస్తున్నాడు. అందులో, దానికి ఎవరైనా వైసీపీ నేత కౌంటర్ ఇస్తే దానిని మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యేలా చేస్తున్నారు. ఆ విధంగా లోకేష్ ఇమేజ్ ను అమాంతం పెంచే ప్రయత్నం బాబు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

రానున్న రోజుల్లో లోకేష్ కు పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చే ఉద్దేశంతో చంద్రబాబు ఇలా ప్లాన్ చేయడం బాగానే ఉన్నా రాజకీయాల్లో ఉన్న నేతలు జనాల్లో తిరగకపోతే పెద్దగా ఉపయోగం ఉండదనే విషయాన్నీ బాబు మర్చిపోతున్నాడు.

ట్విట్టర్ లో కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని విమర్శలు చేయవచ్చు, కానీ ప్రతిసారి అక్కడ నుండే విమర్శలు చేయటం కుదరని పని. ప్రజా వేదికల మీద నుంచి ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తే దానికి వచ్చే పాపులారిటీ వేరేగా ఉంటుంది. మరి లోకేష్ పబ్లిక్ లో మాట్లాడాలంటే నాలుక కరుచుకుంటాడు.

వైసీపీకి కౌంటర్ ఇవ్వబోయి, సొంత పార్టీకే కౌంటర్ వేసే అనుభవం లోకేష్ కి ఉంది. అందుకే ఎక్కువగా ట్విటర్ లో మాత్రమే ఆయన స్పందిస్తున్నాడు. కానీ రానున్న రోజుల్లో అయినా ట్విట్టర్ వదిలి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు లోకేష్ రావలసిన పరిస్థితి ఉంది..

అప్పుడు మీడియా ముందు కూడా ఇలాంటి ఆరోపణల గురించి గట్టిగా మాట్లాడాలి , మీడియా వాళ్ళ ప్రశ్నలకి తడబడకుండా సమాధానాలు చెప్పగలిగిన పరిస్థితుల్లో ఉండాలి. అందుకే లోకేష్ సిద్ధం అవుతాడా అనేది ముందు ముందు చూడాలి.