అధికార పార్టీ దాహానికి బలైపోతున్న దళితులు,గిరిజనులు అని ప్రభుత్వం పై ఫైర్ అయిన నారా లోకేష్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంతలా వ్యవహారం నడుస్తుంది.ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి మరియు టీడీపీ మధ్య ఈ వ్యవహారం రోజురోజుకీ ముదురుతుంది.

 Nara Lokesh Comments On Ycp, Tribal People, Ys Jagan, Nara Lokesh, Tdp, Twitter-TeluguStop.com

మొదట అంశాలపైన మొదలైన ఇరువురి మధ్య విమర్శలు ప్రస్తుతం పతాక స్థాయికి చేరి వ్యక్తి దూషణలకు కారణమవుతున్నాయి.దీనితో ఒకప్పుడు రాష్ట్రంలో నెలకొన్న బాధ్యతాయుత రాజకీయ పరిస్థితి ప్రస్తుతం కరువైంది.

రెండు పక్షాలు ఎడ్డెమంటే తెడ్డెం అంటుండడంతో పై స్థాయి లోనే కాక గ్రౌండ్ లెవెల్ లో కూడా యుద్ధ వాతావరణం నెలకొంటుంది ఇది రాష్ట్ర ప్రజలకు మరింత ఇబ్బంది కలిగిస్తుంది.ఇక తాజాగా నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైసీపీ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

ప్రస్తుతం ఆ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయతీ, మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది.

ఆ భూమిని కొట్టేయడానికి అధికార పార్టీ నాయకులు దాడికి దిగి సుమారు 23 మందిని గాయపర్చారు.ఈ ఘటనలో గిరిజన యువకుడు డబ్బా బాబ్లీ ని అత్యంత కిరాతకంగా హత్యచేసారు.

గిరిజన మహిళని అప్పు తీర్చలేదంటూ వైకాపా నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు గిరిజన యువకుడు బలైపోయాడు.అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్న భూమిని వెంటనే దళితులు, గిరిజన కుటుంబాలకు అందజెయ్యాలి.

డబ్బా బాబ్లీ ని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube